రంగారెడ్డి

నకిలీ ప్రొఫైల్‌తో వైద్యుడిని వేధించిన వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 2: ప్రముఖ వైద్యుడి పేరుతో స్వలింగ సంపర్కుల వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఆసక్తి గలవారు కలవాలని సదరు వైద్యుని ఫోన్ నెంబరుని జత చేశాడు. సదరు వైద్యుడుకి విపరీతమైన కాల్స్ రావడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులకు అంతా చేసింది ప్రముఖ ఐటి సంస్థలో ఉద్యోగి అని తెలిపి పోలీసులు తెల్లబోయారు. రాచకొండ సైబర్ క్రైం సిఐ ఎండి రియాజుద్దీన్ తెలిపిన వివరాలు ఇలావున్నాయి. మాదాపూర్‌లోని ప్రముఖ ఐటి సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న తుమ్మల సురేష్ (29) బాచుపల్లిలోని పవన్ ప్లాజాలో నివాసముంటున్నాడు. స్వయం సంపర్కులతో పరిచయం చేస్తుంటాడు. వారితో చాటింగ్ చేయడంతో పాటు సహవాసం చేయడం అలవాటు. నగరంలో పేరు మోసిన వైద్యుడి పేరుతో గే వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి ఆసక్తి ఉన్నవారు తనని సంప్రదించాలని డాక్టర్ ఫోన్ నెంబరు జత చేశాడు. ఆపరేషన్ ధియేటర్‌లో ఉన్నా ఎక్కడున్నా సమయం సందర్భం లేకుండా రోజుకి 60, 70 ఫోన్లు వచ్చేవి. దీంతో స్వలింగ సంపర్కులు వైద్యునికి ఫోన్ చేసి అసభ్యకరంగా వేధించడంతో ఎందుకు ఫోన్లు వస్తున్నాయో ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. సదరు వైద్యుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ చేస్తున్న పోలీసులకు నిందితుని వివరాలు తెలుసుకుని అవాక్కయ్యారు. నిందితుడు పేరున్న ఐటి సంస్థలో టీమ్ లీడర్ కావడం నెలకు 80వేలు జీతం ఉండి ఇదేం రోగమనుకున్నారు. సురేష్ స్వలింగ సంపర్గులతో పరిచయంచం ఉన్నట్లు తేలింది. నిందితుడిని అరెస్టు చేసిన సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రియాజుద్దీన్ తెలిపారు.