రంగారెడ్డి

సంతకం ఫోర్జరీ కేసులో రాచకొండ పోలీసు కమిషనరేట్ సీనియర్ అసిస్టెంట్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 6: పోలీసు ఉన్నతాధికారుల ఫోర్జరీ సిగ్నచర్ కేసులో ఇద్దరు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో నివసిస్తూ రాచకొండ కమిషనరేట్‌లోని జిపిఎఫ్ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఆలె అశోక్ సహకారంతో రామంతాపూర్ బాలాజీనగర్‌లో నివసిస్తున్న ఎం.వేణుగోపాల్ పోలీసు ఉన్నతాధికారుల సిగ్నచర్స్‌ను ఫోర్జరీ చేసి ప్రైవేటు సెక్యూరిటీ సర్వీస్ లైసన్స్‌ను ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందని అడిషనల్ డిసిపి క్రైం డి.జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.
ఈ కేసులో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పని చేస్తున్న సెక్షన్ ఇంచార్జి సునందరాజు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అనీల్, వికారాబాద్ ఎస్‌పి కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వసంతకుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మన్‌మీత్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.