రంగారెడ్డి

త్వరలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, డిసెంబర్ 6: ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోలు డివిజన్ ఆదర్శనగర్ గుడిసెలను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ ఆబ్‌నర్ మంగళవారం సందర్శించారు. గుడెసెవాసుల సమస్యలను అడిగి తెలుకున్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను తెలుసుకున్నారు. సర్వెనెంబర్ 5లోని ప్రభుత్వ స్థలంలో గత కొంతకాలంగా గుడెసెలు వేసుకొని నివాసం ఉంటున్న 146 మంది పేదలకు జీఓ 58ప్రకారం అర్హులైన పేదవారు 113 మందిని గుర్తించి ఆన్‌లైన్ ద్వారా పట్టాలు మంజూరు చేసింది. మరో 27మందికి పూర్తిస్థాయిలో విచారణ జరిపి పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. వీరితోపాటు తల్లిదండ్రుల వద్ద వివాహం అయ్యి ఒకే గుడెసెలో నివాసం ఉంటున్న మరో 17మందికి పట్టాలు మంజూరు చేయాలని గుడిసె వాసులు అధికారులను కోరారు. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్‌నార్, సరూర్ నగర్ మండల డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు కాలనీలో సందర్శించి నిజమయిన లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజమయిన లబ్ధిదారులకు తప్పకుండా పట్టాలు అందజేస్తామని జెసి హామీ ఇచ్చారు. త్వరలో గుడిసెలను ఖాళీ చేయించి డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కోసం జిహెచ్‌ఎంసికి ఆ స్థలాన్ని అప్పగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెర్కు సంగీత ప్రశాంత్ గౌడ్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, ఎల్బీనగర్ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి ఎం.రామ్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.