రంగారెడ్డి

తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, డిసెంబర్ 9: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియమ్మదేనని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గంలోని యూత్ కాంగ్రెస్ తుక్కుగూడ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సోనియమ్మ జన్మదిన వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ఎంపిపి స్నేహ, వైస్ ఎంపిపి స్వప్న, పార్టీ అధ్యక్షుడు శివమూర్తి, నేతలు రాజు, వీరేష్, బాల్‌రాజు పాల్గొన్నారు.
ఆర్‌కెపురంలో..
ఎల్‌బినగర్: తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలుగా నిరీక్షించిన రాష్ట్ర కళను సాకారం చేసిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రజలు ఎప్పటికీ మరువరని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు దేప భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తపేట చౌరస్తాలో నిర్వహించిన సోనియాగాంధీ జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ను కట్ చేశారు. దేప మాట్లాడుతూ తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ అయితే మేము తెచ్చామని చెప్పుకొని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస.. రైతుల రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్, ఇంటింటికి ఉద్యోగం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ఆసరా పెన్షన్లు తదితర పథకాలను పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో సోనియాగాంధీ నేతృత్వంలో దేశ, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు చిలుక ఉపేందర్‌రెడ్డి, పున్న గణేష్, సాజీద్, గట్ల రవీంద్ర, మహేందర్ యాదవ్, సురేష్, సైదులు, రఫి, అహ్మద్, సూర్యపాల్, ఇమ్రాన్, పులి, రాజు యాదవ్, శివ, సాయి, దేవేందర్, బాల్‌రాజ్, యుగేందర్, శ్రీకాంత్ ఉన్నారు.
మన్సూరాబద్ చౌరస్తాలో..
వనస్థలిపురం: ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ యువజన విభాగం నాయకులు ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన్సూరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ చౌరస్తాలో ఏర్పటు చేసిన పుట్టిన రోజు వేడుకలకు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరైనారు. సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేఖం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి స్థాయిలో సహకరించిన దేవత సోనియా అని గుర్తు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కళ్లెం రాఘవేందర్ రెడ్డి, కూరేళ్ల వేములయ్య గౌడ్, పారెపల్లి చంద్రారెడ్డి,ఘట్టు నర్సింహారావు, కొప్పుల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.