రంగారెడ్డి

గ్రేటర్ అధికారులపై బిగుస్తున్న ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నానక్‌రాంగూడలో కూలిన భవనం కేసును సైబరాబాద్ పోలీసు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ డిసిపి క్రైమ్స్ శ్రీనివాస్ రెడ్డిని దర్యాప్తు అధికారి పర్యవేక్షిస్తున్నారు. భవనం యజమాని సత్తూసింగ్‌పైన అతని కుమారుడు అనిల్ కుమార్ సింగ్‌పైన స్టక్చరల్ ఇంజనీర్, మేస్ర్తిలపై కేసులు నమోదు చేశారు. భవనం నిర్మాణ సమయంలో యజమాని సత్తూసింగ్.. ఎవరెవరికి లంచం ఇచ్చాడో కూపీ లాగుతున్నారు. టౌన్‌ప్లానింగ్ సిబ్బందికి మధ్యవర్తులుగా గతంలో రెవెన్యూ విభాగంలో పని చేసి ముజ్రాడాన్స్ కేసులో సస్పెండ్‌కు గురైన ఇద్దరు ఉద్యోగులు ఉన్నాట్లు తెలిసింది. సదరు ఉద్యోగులే అసిస్టెంట్ సిటీప్లానర్‌కు తెలియకుండా ఈ వ్యవహారం నడినినట్లు తెలిసింది.

రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో వ్యాపారి కిడ్నాప్
పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమార్తె
జీడిమెట్ల, డిసెంబర్ 11: రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో ఒకరిని కిడ్నాప్ చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శేషుబాబు కథనం ప్రకారం.. గాజులరామారం రోడ్డు, నెహ్రూనగర్‌లో నివాసముండే మల్లిఖార్జున్ యాదవ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కుమార్తె ప్రవళికను ఓ ఎంపి పిఎ సురేశ్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశాడు. భార్య ప్రవళికతో సురేశ్‌రెడ్డి కడపలో నివసిస్తున్నాడు. కడపలో సురేశ్‌రెడ్డి స్నేహితుడైన నర్సింహారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల ప్రవళిక గర్భిణి కావడంతో తండ్రి మల్లిఖార్జున్ యాదవ్ ఇంటికి వచ్చింది. సురేశ్‌రెడ్డి, నర్సింహారెడ్డి మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీల్లో విభేదాలు వచ్చాయి. మల్లిఖార్జున్ యాదవ్ ఇంటికి నర్సింహారెడ్డి మరో ఇద్దరితో కలిసి వచ్చాడు. అల్లుడు సురేశ్‌రెడ్డి డబ్బులు ఇవ్వాలని మల్లిఖార్జున్ యాదవ్‌ను తీసుకుని వెళ్లారు. మల్లిఖార్జున్ కూతురు ప్రవళిక గుర్తించి తన తండ్రిని కిడ్నాప్ చేశారని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చలిగాలులతో గజగజ
అల్వాల్, డిసెంబర్ 11: రెండు రోజులుగా నగరం, నగర శివారుల్లో చలిగాలులతో ప్రజలు గజగజలాడుతున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి చలిగాలులు ప్రారంభమవుతుండటంతో ఉద్యోగాల నుంచి ఇంటికి చేరే ఉద్యోగులు చలి తీవ్రతతో ఆందోళన చెందుతున్నారు. నగర శివారు ప్రాంతలో మరింతగా చలిగాలులు వీచటంతో స్వెట్టర్లు, మఫ్లర్లును వేసుకుంటున్నారు. చాలా మంది శ్యాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. మరో వైపు డబ్బుల కోసం ఎటిఎంల వద్ద లైన్‌లు కడుతున్నవారు కూడా చలికి గజగజ వణుకుతున్నారు. ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలుల ప్రభావం దక్షిణ భారతంపైన పడింది. రెండు రోజులుగా వీస్తున్న గాలులకు ప్రజలు సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే బయటకు రావాలంటే వణుకుతున్నారు. చిన్నారులు , విద్యార్థులు ఉదయం పాఠశాలకు వెళ్లాలన్నా సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకొనే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు.