రంగారెడ్డి

ఉపాధిహామీ పథకం ద్వారా పంటసాగుకు వౌలిక సదుపాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, డిసెంబర్ 20: సిఎం ఆదేశాల మేరకు నో యువర్ డిస్ట్రిక్ట్ ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్స్‌లో భాగంగా మండల అభివృద్ధి అధికారులు తమ మండల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, చిన్న, మధ్యతరహా రైతుల అభివృద్ధికి వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక శాఖల ద్వారా రైతు పొలాల్లో సాగుకు అవసరమైన వౌలిక సదుపాయాలను ఉపాధిహామీ పథకం ద్వారా కల్పించి ఉపాధి కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్ పి.సునీతామహేందర్‌రెడ్డి అధ్యక్షతన మండలాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు వ్యవసాయం, ఉద్యాన, పశు సంవర్థక శాఖలు ప్రాధాన్యత అంశాలని ఆయా శాఖల అధికారులు గుర్తించిన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పంపిణి చేసిన భూమిని, రైతు పేర్లను ఎంపిడివోలకు అందించి తద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కొనసాగించి పొలాలను పూర్తిగా సాగులోకి తెచ్చేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఉపాధి పథకం ద్వారా సాగుకు అనువైన 74 పనులను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలుపర్చడంలో ఎంపిడివోలు కీలక బాధ్యత వహించాలని ఆదేశించారు. ప్రతి మండలం నుండి ఆరుగురు రైతుల బృందం అవగాహన సదస్సు గాని, సభ ద్వారా గాని ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎంపిడివోలు మండలానికి చెందిన అధికారులతో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక కోసం స్థలాలు ఎంపిక చేసి నివేదిక పంపాలని పేర్కొన్నారు.
ఉపాధి పథకంలో భాగంగా చెరువులలో మట్టిపూడికతీత ద్వారా సాగు చివరి వరకు నీరందించవచ్చని తెలిపారు. కోట్‌పల్లి ప్రాజెకుట ద్వారా 9000 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉండగా 6000 ఎకరాలకు మాత్రమే నీరందుతోందని వివరించారు.
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రణాళికలో భాగంగా రైతులకు ఉపాధి హామీ పథకం పనులపై అవగాహన కల్పించాలని, రైతులకు ధాన్యం తరలించడానికి వీలుగా రోడ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని, పెద్దెముల్, కులకచర్ల, బషీరాబాద్ గ్రామాలను సందర్శించి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
రెడ్డిపల్లి గ్రామానికి రోడ్డు కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని అన్నారు. వేసవిలో పశువులు మృత్యువాత పడకుండా అంటువ్యాధులు ప్రబలకుండా పశు సంవర్థక శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేసిన అసైన్డ్ ల్యాండ్ వివరాలు విఆర్‌వో, తహశీల్దార్ ద్వారా అందుబాటలో ఉన్నాయని వివరించారు. 55 చెరువుల ద్వారా ఐదు వేల ఎకరాలకు తైబంది చేశామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి పిడబ్ల్యు జాన్సన్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా అసైన్డ్ భూముల్లో పొదల తొలగింపు, మట్టి పూడికతీత, పశు సంవర్థక శాఖ ద్వారా కంపోస్ట్ పిట్, నాన్ కంపోస్ట్‌పిట్, వర్మి కంపోస్ట్‌పిట్, పశువులు, మేకలకు షెడ్లు, పౌల్ట్ఫ్రీమ్ ప్లాంటేషన్, నీటి నిల్వ కోసం పామ్‌పాండ్, డగ్ అవుట్ పాండ్స్, ఎరె్తైన్ బండింగ్ రీచార్జ్ బోర్‌వెల్స్, ఐహెచ్‌హెచ్‌ఎల్ పనులను ప్రణాళిక ప్రకారం మండలాల వారీగా పూర్తి చేయడంలో వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక శాఖలు సంయుక్తంగా పనులు చేపట్టాలని చెప్పారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జడ్పీ సిఇవో రమణారెడ్డి, వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

ఘట్‌కేసర్, డిసెంబర్ 20: నిబంధనలు అతిక్రమించి అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు చేపడితే కఠినచర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్ హెచ్చరించారు. మండల పరిధి ఇస్మాయిల్‌ఖాన్ గూడ గ్రామంలో అక్రమంగా వెలసిన నిర్మాణాలు, లేఅవుట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. అక్రమ లేఅవుట్లపై విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని ఇఓపిఆర్‌డి సునంద, కార్యదర్శి నరసింహరావులను ఆదేశించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చేసిన లేఅవుట్‌ను గ్రామ పంచాయతీ సిబ్బందితో కూల్చివేయించారు. ఇస్మాయిల్‌ఖాన్‌గూడ గ్రామంలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు ఉన్నట్టు ప్రజావాణిలో అనేక ఫిర్యాదులు వచ్చినట్టు చెప్పారు. ఫిర్యాదులకు స్పందించి విచారణ జరపాలని ఇప్పటికే స్థానిక అధికారులకు ఆదేశాలు జారి చేసినట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమించి చేపట్టిన లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హెచ్చరించారు.
ముందుస్తు ప్రభుత్వ అనుమతులు తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గ్రామాలలో జరుగుతున్న అక్రమ లేఅవుట్లను నివారించటంతో పాటు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఘట్‌కేసర్ మండలంలోని అన్ని గ్రామాలలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు ఉన్నట్టు సమాచారం ఉందని, ఇప్పటికే పలు గ్రామాలలో కూల్చివేతలు జరిపినట్లు చెప్పారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించే సమస్యే లేదన్నారు. మండల విస్తరణాధికారి సునంద, పంచాయతీ కార్యదర్శి నరసింహరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.