హైదరాబాద్

సబ్సిడీ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా అందించే సబ్సిడీ బియ్యం, చక్కెర, గోధుమలు, కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మేడ్చల్ జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి వి.నాగేశ్వర్‌రావు హెచ్చరించారు. మంగళవారం సర్కిల్-2ఉప్పల్ పరిధిలోని పలు రేషన్ షాపులలో తనిఖీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేషన్ షాపులలో అవకతవకలు జరుగకుండా నిరంతరం నిఘా పెట్టామని పేర్కొన్నారు. షాపులలో తీసుకునే ప్రతి వస్తువుకు ఆయా షాపుల డీలర్లు.. లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. సమయ పాలన పాటించాలని, షాపులకు వచ్చిన బియ్యం, చెక్కర, గోదుమలు, కిరోసిన్ ఇతర వస్తువులను సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వకుండా తిప్పుకుంటూ బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే వారిపై కేసులు నమోదు చేసి షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. షాపులలో సబ్సిడీకి సంబంధంలేని ఇతర వస్తువులను తీసుకుంటేనే బియ్యం, చెక్కర ఇస్తామని బలవంతం చేస్తే సహించమని, వాటిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత పెండింగ్ కొత్త కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అందరికీ అందేలా సత్వర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ఉప్పల్, బాలానగర్ సర్కిళ్లతో పాటు ఏడు మండలాలలో మొత్తం 636 షాపులు ఉండగా 4లక్షల 61వేల తెల్లకార్డులు, 18వేల 330 అంత్యోదయ కార్డులు ఉన్నాయని వివరించారు. నిత్యావసర వస్తువులు పక్కదారిన పోకుండా జిపిఎస్ సిస్టమ్ ద్వారా గోదాం నుంచి నేరుగా వాహనాలలో షాపులలోకి వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలందించడమే సివిల్ సప్లయిస్ శాఖ లక్ష్యమన్నారు. ఏమైనా సమస్యలు వస్తే నేరుగా ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఏఎస్‌ఓ ప్రేమ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని నాగేశ్వర్‌రావు తెలిపారు. సమావేశంలో ఏఎస్‌ఓ ప్రేంకుమార్ పాల్గొన్నారు.
అవకతవకలు పాల్పడిన రేషన్ షాపుపై కేసు
ఆకస్మిక తనిఖీలో మల్కాజిగిరిలోని షాపు నెంబర్ 276లో అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైందని ఏఎస్‌ఓ ప్రేమ్‌కుమార్ తెలిపారు. రికార్డుల ప్రకారం ఎక్కువ, తక్కువ వస్తువులు ఉన్నట్లు తేలిందని, అందుకే షాపుపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

ఎంపిడివోలకు
జిల్లా కలెక్టర్ దివ్య సూచన
వికారాబాద్, డిసెంబర్ 20: వికారాబాద్ జిల్లాను కూరగాయలు, పండ్ల తోటల పెంపకంలో ముందుంచడానికి మండల అభివృద్ధి అధికారులు ప్రణాళికలు రూపొందించి అమలుపర్చాలని జిల్లా కలెక్టర్ డి.దివ్య సూచించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో ఎంపిడివోలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలాభివృద్ధి అధికారులు కూరగాయలు, పండ్ల తోటలపై విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామాలవారీగా ఏర్పాటును రూపొందించి రసాయనేతర కూరగాయలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు పొలం చుట్టూ తవ్వకాలను జరిపి నీటి నిల్వ, చేపల పెంపకం, మట్టి ద్వారా కూరగాయలను సాగు చేసుకుంటే రైతులు లాభపడతారని అభిప్రాయపడ్డారు. ఉపాధి హామీ పనులను అన్‌సీజన్‌లో చేయడం ద్వారా రైతులకు ఉపాధి లభిస్తుందని వర్షాకాలంలో సాగుకు సిద్ధంగా ఉండాలని ఉద్యానశాఖ ద్వారా హిమాయల్ పసంద్ మామిడి రకాన్ని పెంచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపిడివోలు మ్యాజిక్ సోక్ పిట్‌ను గ్రామీణ ఉపాధి హామీ ద్వారా పనులు చేపట్టి ఒడిఎస్‌గా ప్రకటించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో రైతులందరూ పామ్‌పాండులను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి మండలంలో వెటర్నరీ డాక్టర్, మండల వ్యవసాయాధికారుల భాగస్వామ్యం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉద్యానశాఖకు కేటాయించిన విధులను ఉపాధి హామీలో భాగంగా అజోలా పిట్ పైన రైతులకు అవగాహన కల్పిచాలని, భూగర్భజల శాఖ ద్వారా బోర్‌వెల్ షిప్పింగ్ స్ట్రక్చర్ సొసైటీ అభివృద్ధి చేయాలని సూచించారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, డిఆర్‌డివో పిడి జాన్సన్, ఎంపిడివోలు పాల్గొన్నారు.