రంగారెడ్డి

రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, జనవరి 10: ఒంటరి వృద్ధ మహిళను టార్గెట్ చేసుకుని రెండు తులాల బంగారు గొలుసును చైన్‌స్నాచర్ లాకెళ్లిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైమ్ సిఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కాప్రా శ్రీరామ్‌నగర్‌కు చెందిన రతన్‌దేవి(60) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మెడలో రెండు తులాల బంగారు గొలుసును దొంగ లాకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టామని క్రైమ్ ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కొందుర్గు, జనవరి 10: బైక్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కొందుర్గు ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం సోమవారం రాత్రి మండల పరిధిలోని శ్రీరంగాపూర్ గేటు వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. షాద్‌నగర్ నుండి కొందుర్గు వైపు ద్విచక్ర వాహనంపై గుండెటి ఎల్లయ్య (52), తొండపల్లి జంగయ్య (48) అనే ఇద్దరు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు వివరించారు.
పద్మజ సాఫల్యత కేంద్రంపై ఐటి దాడులు
ఉప్పల్, జనవరి 10: హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 7లో ఉన్న డాక్టర్ పద్మజ సాఫల్యత కేంద్రంపై మంగళవారం ఆదాయం పన్ను అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగియున్నారన్న అభియోగంపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. పూర్తి వివరాలను వెల్లడించడానికి ఐటి అధికారులు నిరాకరించడం గమనార్హం.
యువకుడికి కత్తిపోట్లు
సైదాబాద్, జనవరి 10: సరదాగా వేసుకున్న క్రికెట్ బెట్టింగ్ కత్తిపోట్లకు దారి తీసింది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డి కాలనీలో నిన్న అర్థరాత్రి ముగ్గురు స్నేహితులు కలిసి మద్యం సేవించిన అనంతరం సరదాగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించారు. ఈ బెట్టింగ్‌లో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి క్యాబ్‌డ్రైవర్ దేవేందర్(30)పై మరో ఆటోడ్రైవర్ యూసఫ్ కత్తితో దాడిచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన దేవేందర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. యూసుఫ్‌ను అదుపులోకి తీసుకొని అతనిపై కేసునమోదు చేశారు. దేవేందర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.

భోలక్‌పూర్‌లో జలమండలి డైరెక్టర్ పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 10: భోలక్‌పూర్ డివిజన్‌లోని ఇందిరానగర్, గుల్షాన్‌నగర్, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో జలమండలి మెయింటనెన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వరరావు స్థానిక కార్పొరేటర్‌తో కలిసి మంగళవారం పర్యటించి వాటర్, డ్రైనేజీ సరఫరాను పరిశీలించారు. బస్తీల్లోని ప్రజలు వ్యర్థ పదార్థాలను కచ్చమోరిలో వేయకుండా ఏకంగా డ్రైనేజీలు వేయడంతో వెంటనే నిండి ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రజల్లో పూర్తి స్థాయి ఆవగాహన తెచ్చేందుకు గాను జలమండలి విస్తృతంగా ప్రచారం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరు నీటిని పొదుగా వడాలని, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా సమయంలో స్థానికులు ఏకంగా విద్యుత్ మోటార్ల సహాయంతో నీటిని పట్టుకుంటున్న దృశ్యాలను చూసిన జలమండలి అధికారులు నివ్వరపోయారు. నీటి సరఫరా సమయంలో విద్యుత్ మోటార్లు వినియోగించడం బోర్డు నిబంధనలకు విరుద్ధమని, నీటి సరఫరా సమయంలో నిబంధనలను ఉల్లఘించి విద్యుత్ మోటార్లు వాడితే ఆలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవ్వరైన విద్యుత్ మోటార్లు వాడితే నీటి కనెక్షన్లను తొలగించేందుకు సైతం వెనుకడుగు వేయబోమని హెచ్చరించారు. వినియోగదారులు సకాలంలో నీటి బిల్లులు చెల్లించి బోర్డు మనుగడకు దోహదాపడాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అఖీల్ అహ్మద్ నారాయణగూడ డివిజన్ జనరల్ మేనేజర్ చేరుకూరి రాజా పాల్గొన్నారు.
* కొత్తగా ఏయిర్‌టెక్ మిషన్‌లు
రోడ్లపై కాకుండా బస్తీల్లో ఇరుకుగా ఉండే గల్లీలో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్లను క్లినింగ్ చేసేందుకు జలమండలి నూతనంగా 70 మినీ ఏయిర్‌టెక్ మిషన్‌లను అందుబాటులోకి తెస్తోంది. ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 58 హైర్‌టెక్ మిషన్‌లు పనిచేస్తున్నాయి. వీటిలో 47 ప్రైవేట్ కాగా మిగత 11 ఏయిర్‌టెక్ మిషన్‌లు జలమండలి సమాకుర్చుకుంది.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్రైనేజీల ఓవర్‌ఫ్లో వంటి సమస్యలు తలెత్తినపుడు జలమండలి సివరేజీ కార్మికులు ఏయిర్‌టెక్ మిషన్‌ల సహకారంలో డ్రైనేజీలు శుభ్రం చేస్తారు. డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నపుడు చోటు చేసుకుంటున్న ప్రమాధాలను అరికట్టేందుకు జలమండలి అనేక ప్రయత్నాలు చేస్తోంది. డ్రైనేజీలో మ్యాన్‌హోల్ కవర్లను తీసి వాటిలో ఉన్న కెమికల్ గ్యాస్‌ను పరిశీలించిన తరువాతే సివరేజీ కార్మికులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. డ్రైనేజీ మ్యాన్‌హోళ్లలో ఉండే సిల్ట్‌ను బయటికి తీసేందుకు దాదాపు 280 ప్రత్యేకంగా తయారు చేసిన పరికరాలను జలమండలి కొనుగోలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 70 మిని హేయిర్‌టెక్ మిషన్‌లు నెలరోజుల్లో అందుబాటులోకి రానున్నాయని జలమండలి మెయింటనెన్స్ విభాగం అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి 70 మినీ ఎయిర్‌టెక్ మిషన్‌ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.15.123కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డ్రైనేజీలో వ్యర్థ పదార్థాలను పడేయవద్దని ఇందుకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో ఆవగాహన శిబిరాలను సైతం నిర్వహించేందుకు జలమండలి సిద్ధమైంది.

సర్కారు బడుల్లో మెరుగైన విద్యాబోధన
శేరిలింగంపల్లి, జనవరి 10: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధనకు సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 36లక్షలతో బిహెచ్‌ఇఎల్ నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) కింద భెల్ సంస్థ నిర్మించిన మూడు తరగతి గదులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి చైర్‌పర్సన్ రాగం సుజాతయాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్, బిహెచ్‌ఇఎల్ జనరల్ మేనేజర్ జి.ఉదయ్‌కుమార్‌లతో కలిసి మంత్రి ప్రారంభించి వాటిని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలలోని వెనకబడిన ప్రాంతాల్లో ఎస్‌సి, బిసి, మైనారిటీ విద్యార్థుల ఆశ్రమ పాఠశాలల నిర్మాణానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం 180కోట్లు కేటాయించిందని చెప్పారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు బాధ్యతగా నిధులు కేటాయించానని తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్‌యాదవ్ మాట్లాడుతూ జడ్‌పిహెచ్‌ఎస్ స్కూల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా భెల్ సంస్థకు మంత్రి, అతిథులు కృతజ్ఞతలు తెలుపుతూ జిఎం ఉదయ్‌కుమార్‌ను సత్కరించారు. భెల్ ఎజిఎం పండరీనాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అరవిందరెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు మిరియాల రాఘవరావు, గుర్రపురవీందర్‌రావు, దుర్గం వీరేశంగౌడ్, బొల్లంపల్లి సత్యనారాయణరెడ్డి, బద్దం కొండల్‌రెడ్డి, డోకూరి రామ్మోహన్‌రెడ్డి, రక్తపు దశరథ్‌గౌడ్, చింతకింది రవీందర్‌గౌడ్, కృష్ణయాదవ్, బస్వరాజు, చంద్రకళ పాల్గొన్నారు.

స్ర్తినిధి రుణాల మంజూరు, రికవరీకి చర్యలు

వికారాబాద్, జనవరి 10: స్వయం సహాయక సంఘాలకు స్ర్తినిధి రుణాల మంజూరు, రికవరీకి ఎపిఎంలు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో స్ర్తినిధిపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లో సమృద్ధి పొందడమే కాకుండా పాటించాలని చెప్పారు. స్వయం సహాయక గ్రూపు సభ్యులు ప్రతినెలా పది రూపాయలను పొదుపు చేయడం ద్వారా స్ర్తినిధి రుణాలు పూర్తిగా వినియోగించుకోవడంలో ఎపిఎంలు ప్రధానభూమిక పోషించాలని పేర్కొన్నారు. స్ర్తినిధి రుణాలు ముఖ్యంగా కౌలురైతులకు వర్తింపజేసి సహకరించాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా పంటరుణాలు పొందని వారికి ప్రాధాన్యతా క్రమంలో స్ర్తిశక్తి నిధి రుణాలు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ధారూర్‌లో 754, నవాబ్‌పేటలో 619, బంట్వారంలో 582, పూడూర్‌లో 638, కొడంగల్‌లో 445, పెద్దెముల్‌లో 567 సంఘాలున్నాయని, ఇతర మండలాల్లో సమృద్ధి పొదుపు వెంటనే ప్రారంభించి రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పశు సంవర్థక శాఖ ద్వారా పశువులకు షెడ్‌లు ఇతరత్రా సౌకర్యాలు కల్పించడానికి స్ర్తినిధి ద్వారా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని వివరించారు. స్ర్తినిధి రీజినల్ మేనేజర్ విద్యాసాగర్ మాట్లాడుతూ అరవైరోజుల ప్రణాళికతో స్ర్తినిధి ద్వారా ముప్పై కోట్ల రుణాల మంజూరీకి సంఘం సభ్యులు పొందేలా ఎపిఎంలు సమృద్ధి పొదుపు వెంటనే అమలు చేయాలని సూచించారు. ప్రతిరోజు 50 లక్షల రుణాల మంజూరు, ప్రతి గ్రూపు 25 వేల రుణం మంజూరు చేయించాలని పేర్కొన్నారు. స్ర్తినిధి ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లకు రుణం మంజూరు పొందవచ్చని పేర్కొన్నారు. స్ర్తినిధి రుణం ద్వారా ఉపాధి కల్పించాలని తెలిపారు. సమీక్షలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి పిడబ్ల్యు జాన్సన్, జిల్లా పంచాయతి అధికారి మాజీద్, జిల్లా సమాఖ్య అధ్యక్షులు పాల్గొన్నారు.

గ్రామాల్లో ప్రధాన సమస్యలపై దృష్టి
షాబాద్, జనవరి 10:గ్రామాల్లో ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా పరిషత్ సిఇవో రమణారెడ్డి అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో స్థిరాస్తులు, ఇంటి, నీటి పన్నులు వసూలు చేసి గ్రామఅభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. మండలంలోని 10 గ్రామ పంచాయతీల్లో 10శాతం లోపు మాత్రమే పన్ను వసూలు చేశారన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన బియ్యాన్ని విద్యాశాఖ కార్యాలయం నుండి అలాట్‌మెంట్‌కు పంపితే తహశీల్దార్ ఉషాకిరణ్ మీరెందుకు అలాట్‌మెంట్ చేస్తున్నారు చేస్తే మేమే చెయ్యాలని నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని మండల విద్య అధికారి గోపాల్ మండల ప్రత్యేక అధికారికి వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.షాబాద్ మండల పరిధిలోని బోబిలిగాం గ్రామంలో పెంచుతున్న నర్సరీలను ఆయన పరిశీలించారు. అనంతరం వచ్చే హరితహారం కార్యక్రమానికి 2లక్షల మొక్కలు రైతులకు అందించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో పద్మావతి, ఈవోఅర్‌డి వసంతలక్ష్మి, ఏవో సంయుక్త, ఏఈ ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

కత్రీయ హోటల్‌లో అగ్ని ప్రమాదం

ఖైరతాబాద్, జనవరి 10: సోమాజిగూడలోని కత్రీయా హోటల్‌లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్యూట్‌తో హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. అంతస్తులో పాత పరుపులు ఉండటంతో వాటికి అంటున్న మంటలు అంతస్తు మొత్తం వ్యాపించాయి. సుమారు 8:30 గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హోటల్ నుంచి పెద్దయెత్తున పొగలు వస్తుండటంతో గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఇతర అంతస్తులకు వ్యాప్తిచెందకుండా ఆర్పివేశారు. నగరం నడిబొడ్డున ఉన్న హోటల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుందన్న విషయం తెలుసుకున్న పోలీస్, అగ్నిమాపక ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. అగ్నిమాపక శాఖ డిజి రాజీవ్ రతన్, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది సుమారు గంటన్నర పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పెద్దహోటల్‌లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఆర్పివేసే యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే ప్రమాద స్థాయి పెరిగిందని తెలుస్తోంది.
సిబ్బంది దురుసు ప్రవర్తన
హోటల్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయాన్ని తెలుసుకున్న మీడియా వాటిని చిత్రీకరించేందుకు వెళ్లగా హోటల్‌లో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. ఓ దశలో దాడికి యత్నించడంతో తీవ్ర ఆగ్రహావేశాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.

డాక్టర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ముషీరాబాద్, జనవరి 10: ‘హలో..నేను పలానా పోలీస్‌స్టేషన్ ఎస్సైను మాట్లాడుతున్నాను.. మీ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకున్న వ్యక్తి బంధువు అపస్మారకస్థితిలో ఉన్నాడు.. మీరు రాసిచ్చిన మందులు వాడటం వల్లే చావుబ్రతుకుల మధ్య ఉన్నాడని ఫిర్యాదు వచ్చింది’ అంటూ నగరంలోని పలువురు డాక్టర్లకు ఫోన్ చేసి బెదిరిస్తూ అందినకాడికి బ్యాంకుఖాతాకు డిపాజిట్ చేయించించుకుంటూ కుచ్చుటోపి పెడుతున్న ఓ ప్రబుద్ధిడి గుట్టును ముషీరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మంగళవారం ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిక్కడపల్లి ఎసిపి జె.నర్సయ్య, ఇన్స్‌పెక్టర్ బి.మోహన్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఆసిఫ్‌నగర్, జీరా కిషన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాజిద్ అలియాస్ సాదిఖ్ అలియాస్ అబ్దుల్లా (39) వృత్తి రీత్యా లారీ డ్రైవర్. కుటుంబ అవసరాలకు సరిపడా ఆదాయం రాకపోవడంతో ఎలాగైనా సులభంగా ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాలలోని క్లినిక్, హాస్పిటల్స్ వెళ్లి అనారోగ్యం ఉందని చెప్పి చికిత్స తీసుకునేవాడు. డాక్టర్, హాస్పిటల్ ఫోన్ నెంబర్లు సేకరించి ఫోన్ చేస్తూ మీరిచ్చిన మందలు వాడటంవల్లే ఓ వ్యక్తి తన బంధువు చనిపోయాడనీ, చావుబ్రతుకుల మధ్య ఉన్నాడంటూ ఫిర్యాదు అందిందంటూ ఎస్సై పేరిట ఫోన్ చేసి పరిష్కరించుకోవాలని రాజీ మార్గం పేరిట సాజిద్ ముంబయిలోని తన అత్త బ్యాంకు అకౌంటు నెంబర్ ఇస్తూ అందినకాడికి దండుకునేవాడు. ఈక్రమంలో రాంనగర్‌లోని శ్రీసాయిరాం క్లినిక్ డాక్టర్ ఎన్.లక్ష్మికాంత్ రెడ్డిని ఇదే క్రమంలో మోసం చేశాడు. రెండు దఫాలుగా మొత్తం రూ.40 వేలు జమచేయించుకున్నాడు. మరో సారి ఫోన్ చేసి బెదిరించటంతో అనుమానం వచ్చిన డాక్టర్ లక్ష్మికాంత్‌రెడ్డి ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాజిద్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి రూ.3,800 నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు నగరంలో దాదాపు 18 మంది డాక్టర్లను ఇలానే మోసం చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. హుమాయున్‌నగర్, ఆసిఫ్‌నగర్, జూబ్లిహిల్స్, జగద్గీర్‌గుట్ట, చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయి. సెంట్రల్ జోన్ డిసిపి జోయల్ డేవిస్, అదనపు డిసిపి శశిదర్‌రెడ్డి చిక్కడపల్లి ఎసిపి నర్సయ్య పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరిగింది.

రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ముషీరాబాద్, జనవరి 10: రాష్ట్రంలోని రేషన్ డీలర్లను వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రూ.30 వేలు కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైదరాబాద్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. రేషన్‌డీలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద రేషన్ డీలర్లు మహాధర్నా నిర్వహించారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దాసరి మల్లేషం, బి.ప్రసాద్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వీరేశం, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎంఎ సమద్, కోశాధికారి కె.గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఈ-పాస్ విధానంపై పంపిణి చేస్తున్న రేషన్‌డీలర్లకు క్వింటాల్‌కు రూ.17 గత పదినెలలుగా రావల్సిన అదనపు కమిషన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ఆహర చట్టం ప్రకారం 2013 నుండి కేంద్రం విడుదల చేసిన కమిషన్ క్వింటాల్‌కు రూ.70 పాతబకాయిలతో కలిపి ఈనెల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మండల గోదాములలో ఎలక్ట్రానిక్ కాంటాలతో తూకం వేసి ప్రింటెడ్ రశీదు ద్వారా షాపులకు సరఫరా చేయాలని డిమండ్ చేశారు. హైదరాబాద్‌ను ప్రత్యేక జోన్‌గా పరిగణించి నిర్వహణ ఖర్చును ప్రభుత్వం భరించాలన్నారు. ఆరోగ్యశ్రీ