జాతీయ వార్తలు

‘వివక్ష’ వేడి తగ్గని రాజ్యసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార, ప్రతిపక్ష నేతలతో చైర్మన్ భేటీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గుజరాత్‌లోని ఒక ఆలయంలో తనపట్ల పురోహితులు కుల వివక్ష చూపించారని కాంగ్రెస్ సభ్యురాలు, మాజీ మంత్రి సెల్జా చేసిన ఆరోపణలపై చేలరేగిన వివాదం గురువారం కూడా రాజ్యసభను స్తంభింపచేసింది. పదకొండు గంటలకు ప్రారంభమైన సభ పది నిమిషాలు మాత్రమే సాఫీగా జరిగింది. కాంగ్రెస్ సభ్యులు మాకు న్యాయం కావాలంటూ పెద్దపెట్టున నినాదాలిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. డిప్యూటీ చైర్మన్ కురియన్ రెండు వర్గాలను శాంతింపచేసి సభను నడించటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ వివాదాన్ని పరిస్కరించటానికి చైర్మన్ అన్సారీ పార్టీల నాయకులతో జరిపిన చర్చలు ఫలించాయనీ, మధ్యాహ్నం 12 గంటలకు సమస్య పరిస్కారమైన తీరుపై చైర్మన్ ఒక ప్రకటన చేస్తారని, సభ నడవడానికి సహకరించవలసిందిగా సభ్యులకు విజ్ఞప్తి చేసినా ఫలించలేదు. పాలక ప్రతిపక్షాల వాదోపవాదాలతో సభ మారుమోగిపోయింది. ఒక దశలో డిప్యూటీ చైర్మన్ ఆగ్రహంతో మీరు నన్ను బెదిరించే ప్రయత్నం చేయవద్దు. నేను బెదిరింపులకు భయపడను. రాజ్యసభ గౌరవ మర్యాదలను మంటకలిపే తీరులో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం అని కురియన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పీయూష్ గోయల్ లేచి రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో తాను సెల్జాపై చేసిన వ్యాఖ్యలను ఉససంహరించకుంటున్నట్లు ప్రకటించారు. గోయల్ చేసిన ప్రకటనతో కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. వివాదం సమసిపోయిన తీరుపై చైర్మన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదంటూ మళ్లీ కాంగ్రెస్ సభ్యులు గొడవకు దిగారు. చైర్మన్ పది నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి, సభా నాయకుడైన అరుణ్ జైట్లీ, ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్‌ను తన చాంబర్‌కు రావలసిందిగా ఆదేశించారు. సభ మధ్యాహ్నం రెండు గంటలవరకూ వాయిదా పడింది. ఆ తర్వాత సభ మామూలుగా పని చేసింది. అయితే సమస్య పరిస్కారం అయ్యిందా, కాలేదా అన్న విషయంపై స్పస్టత రాలేదు.
(చిత్రం)రాజ్యసభలో పోడియం వద్ద ఆందోళన చేస్తున్న విపక్ష సభ్యులు