జాతీయ వార్తలు

రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఏడు రాష్ట్రాల్లో 27 రాజ్యసభ స్థానాలకు శనివారం పోలింగ్ ముగిసింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహించగా ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభమైంది. రాజ్యసభలో మొత్తం 57 సీట్లు ఖాళీ కాగా, ఇదివరకే 30 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎపి నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శనివారం నాడు యుపిలో 11, హర్యానాలో 2, కర్నాటకలో 4, ఎంపిలో 3, రాజస్థాన్‌లో 4, ఉత్తరాఖండ్‌లో 1, జార్ఖండ్‌లో 2 స్థానాలకు పోలింగ్ జరిగింది. రాజస్థాన్‌లోని నాలుగు స్థానాల్లో భాజపా విజయం సాధించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా.. భాజపా అభ్యర్థులు గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్‌ నేత ప్రదీప్‌ టంటా విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో మూడు స్థానాలకు గానూ.. రెండింటిలో భాజపా గెలుపొందింది. భాజపా నుంచి ఎంజే అక్బర్‌, అనిల్‌ మాధవ్‌ దావే విజయం సాధించారు. మరో స్థానంలో కాంగ్రెస్‌ మద్దతుతో వివేక్‌ టంకా గెలుపొందారు. ఝార్ఖండ్‌లో రెండు స్థానాల్లో భాజపా జయకేతనం ఎగురవేసింది. కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, మహేశ్‌ పొడ్డార్‌ రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించగా.. ఒక స్థానంలో కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ గెలుపొందారు.