తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడిమ్యాల, జనవరి 11: ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో బైక్‌పై వెడుతున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మంగళవారం సంభవించింది. కొడిమ్యాల మండలం, నల్లగొండ గ్రామంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించినవారిని అప్పరావుపేట గ్రామానికి చెందిన రేకులపల్లి కిషన్‌రెడ్డి (45), అతడి భార్య పద్మ (38), సమీప బంధువు తిప్పాయిపల్లి గ్రామానికి చెందిన దారం శ్రావణి (28)గా గుర్తించారు. వేములవాడ వేములవాడ వెళ్లేందుకు కిషన్, పద్మ బైక్‌పై బయలుదేరగా మార్గం మధ్యలో వారి బంధువు శ్రావణి కలసి అదే బైక్‌పై వారితోపాటు ప్రయాణం కట్టింది. కొద్దిసేపటి తరువాత వారికి ఎదురుగా వస్తున్న ఎంహెచ్ 40, ఎకె 3102 అనే నంబర్ లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో కిషన్‌రెడ్డి, పద్మ, శావ్రణి తీవ్ర గాయాలపై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్ప్రత్రికి తరలించారు. శ్రావణి భర్త అంజిరెడ్డి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లగా, వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కిషన్‌రెడ్డి, పద్మలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా మృతుల బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో అప్పారావుపేట, తిప్పాయిపల్లి గ్రామాల్లో నివసిస్తున్న రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.