జాతీయ వార్తలు

ఉగ్రవాదుల రాక వెనుక డ్రగ్స్ రాకెట్ ప్రమేయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై దాడికి తెగబడిన పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండో-పాక్ సరిహద్దు వెంబడి మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సహకారంతో భారత్‌లోకి చొరబడ్డారని, ముష్కరులు ఈ దాడికి ఉపయోగించిన భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి వారు సరిహద్దు దాటకముందే పాకిస్తాన్ నుంచి భారత్‌కు చేరుకున్నాయన్న అనుమానాలు క్రమేణా బలపడుతున్నాయి. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, నకిలీ భారత కరెన్సీ నోట్లను స్మగ్లింగ్ చేసే ముఠాతో పాటు ‘తెర వెనుక పాత్ర పోషించిన మరికొన్ని శక్తుల’ సహాయ సహకారాలతో వీరు ఎంతో పకడ్బందీగా అంతర్జాతీయ సరిహద్దు దాటి పంజాబ్‌లో ప్రవేశించినట్లు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. వీరు భారత్‌లోకి ప్రవేశించడం వెనుక కొంత మంది భద్రతా సిబ్బంది ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలతో కొంత మంది భద్రతా సిబ్బందికి సంబంధాలు ఉన్నట్లు గతంలోనే సమాచారం లభించినందున ఈ అనుమానాలను తోసిపుచ్చలేమని, ఏది ఏమైనప్పటికీ పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడిపై సమగ్ర దర్యాప్తు జరిపి కొంత మంది వ్యక్తులను ప్రశ్నించిన తర్వాతే దీని వెనుక ఉన్న కుట్ర బహిర్గతమవుతుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.