జాతీయ వార్తలు

విజయ్ మాల్యాను భారత్‌కు రప్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యసభలో కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలోని జాతీయ బ్యాంకులకు దాదాపు తొమ్మిది వేల కోట్ల కుచ్చు టోపీ పెట్టిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించి తీరుతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వెల్లడించారు. శుక్రవారం రాజ్యసభ జీరోఅవర్‌లో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఇతర ప్రతిపక్ష నాయకులు విజయ్ మాల్యా లండన్ పారిపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్‌డిఏ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య ధోరణి మూలంగానే మాల్యా లండన్‌కు వెళ్లిపోగలిగారని ఆజాద్ ఆరోపించారు. ఆయన విదేశాలకు వెళ్లిపోతారనే ముందస్తు సమాచారం ఉన్నా ఆపడానికి అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని, ఎందుకు ముందే అరెస్టు చేయలేదని ప్రతిపక్ష నేత నిలదీశారు. దీనికి నఖ్వీ బదులిస్తూ విజయ్ మాల్యాను భారత దేశానికి రప్పించి తీరుతామని ప్రకటించారు. ‘మీరు ఖత్రోచీని వదిలివేసినట్లు మా ప్రభుత్వం విజయ్ మాల్యాను వదిలి పెట్టదు’ అని ఘాటుగా స్పందించారు. మాల్యా నుంచి డబ్బును రాబట్టుకునేందుకు బ్యాంకులు తీసుకుంటున్న ప్రతి చర్యను ప్రభుత్వం సమర్థిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
18న ఈడి ముందు హాజరుకావాలి
ఈనెల 18 తేదీనాడు తమ ముందు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్టు చెబుతున్న విజయ మాల్యాను ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు పంపించినట్టు తెలిసింది. మాల్యా మార్చి 18 తేదీనాడు ఈడి ఎదుట హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.