జాతీయ వార్తలు

ఆర్టీసీ సమ్మెను విరమించుకోవాలి:కేకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం చూపదని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవటం బాధ కలిగించిందని అన్నారు. వెంటనే యూనియన్ నేతలు సమ్మెను విరమించి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు.ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్‌, 16 శాతం ఐఆర్‌ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని, ఆర్టీసీని ప్రయివేటీకరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారని, అద్దె బస్సులు, ప్రయివేటు స్టేజీ క్యారేజీల విషయంలో సీఎం కేసీఆర్‌ ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని , ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది ఎన్నికల ప్రణాళికలో పేర్కొనలేదు అని కేశవరావు స్పష్టం చేశారు.