తెలంగాణ

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీలోని కొన్ని రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్రంలో 5,100 రూట్ల ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు విశే్వశ్వరరావు వేసిన పిటిషన్‌పై నేడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. ఈ సందర్భంగా ఆయన మూడు సుప్రీం కోర్టు తీర్పులను ఉటంకించారు. జీఓ రాకముందే కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేయవద్దని ప్రభుత్వం వాదించింది. ఈ వాదనతో కోర్టు ఏకభవించింది. అంతేకాదు. మోటారు వెహికిల్ చట్టం ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని పేర్కొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని, రూట్ల ప్రైవేటీకరణ విషయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది.