రుచి

హరితజలంతో ఆరోగ్య భాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలువైన పోషకాలు, మంచి ఔషధ గుణాలున్న ఆకుల నుం చి తీసిన రసాన్ని తరచూ తాగితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని ఆయుర్వేద వైద్యు లు అనాదిగా చెబుతున్నారు. ‘హరితజలం’ పేరిట పలురకాల ఆకుల నుంచి తీసిన రసాన్ని వాడేందుకు ఇటీవల పట్టణ ప్రాం తాల్లో సైతం మొగ్గు చూపుతున్నారు. దీన్ని మన ఇంట్లోనే ఎంతో సులభంగా తయారుచేసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. కొద్దిగా తులసి ఆకులు, పుదీనా, కరివేపాకు, రెండు నిమ్మ ఆకులు, చిన్న అల్లం ముక్క సిద్ధం చేసుకోవాలి. అంగుళం వెడల్పు వున్న కలబంద ముక్క తీసుకుని తొక్కను తొలగించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. అయిదు గ్లాసుల మంచినీటిని ఓ పాత్రలోకి తీసుకుని బాగా మరగబెట్టి, అందులో తులసి, పుదీనా, కరివేపాకు, నిమ్మఆకులు, చిటికెడు పసుపు, కలబంద ముక్కలు, కాస్త యాలకుల పొడి వేసి మూత పెట్టాలి. పది నిమిషాల సేపు ఈ నీటిని అలాగే ఉంచితే ఆకుల్లోని ఔషధగుణాలు నీటిలోకి చేరతాయి. చల్లారాక ఈ హరితజలాన్ని వడకట్టి, కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగాలి. లేత ఆకుపచ్చ వర్ణంలో ఉంటూ, చక్కని పరిమళం వెదజల్లుతూ రుచిగా ఉండే ఈ హరిత జలాన్ని సేవించడం వల్ల అరుచి సమస్య తొలగిపోతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి. జీర్ణక్రియను మెరుగుపరచే గుణాలు ఈ హరిత జలంలో ఉన్నాయి. మలబద్ధకం మొదలైన దోషాలను తొలగించుకోవడానికి ఇది శ్రేష్ఠమైన పానీయం. దగ్గు, జలుబు, తుమ్ములు మొదలైన సమస్యలు ఉన్నవారికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. రక్తదోషాలు, చర్మవ్యాధులు వున్నవారు ఈ నీటిని సేవించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. కాఫీ, టీ ఎక్కువగా సేవించే అలవాటు వున్నవారు రోజూ ఒకటి రెండుసార్లు ఆకుపచ్చని నీటిని సేవించవచ్చు. ఇలా చేయడం వల్ల కాఫీ, టీ తాగడాన్ని క్రమంగా తగ్గించుకోవచ్చు. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటికి వచ్చిన అతిథులకు కాఫీ, టీలకు బదులుగా హరితజలాన్ని ఇస్తే మంచిది. ఇంటి పెరట్లో లేదా బాల్కనీలోని కుండీలలో తులసి, పుదీనా, కలబంద, కరివేపాకు మొక్కలను పెంచినట్లయితే, మన అవసరాలకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆకులను కోసి హరిత జలం తయారు చేసుకోవచ్చు.

-జి.అరుణ