రుచి

శీతగాలుల వేళ పోషకాలు ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన పోషకాలు తీసుకోని పక్షంలో చలికాలంలో ఏ వయసువారికైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. వాతావరణ పరిస్థితుల కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ, వైరస్ వ్యాధులతో పాటు చర్మం పొడి బారడం వంటి ఇబ్బందులు అనివార్యమవుతాయి. చలిగాలుల వేళ శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. ముఖ్యంగా చిరుధాన్యాలు, ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. శక్తి పెరగడానికి పిండి పదార్థాలు, శారీరక ఎదుగుదలకు కొవ్వు పదార్థాలు, ఊబకాయం తగ్గడానికి పీచు, రోగనిరోధక శక్తి వృద్ధికి మాంసకృత్తులు, ఆరోగ్యవంతమైన చర్మానికి, ఊపిరితిత్తులు బాగా పనిచేసేందుకు, దృష్టి దోషాల నివారణకు విటమిన్-ఎ ఎంతో అవసరం. చలికాలంలో శరీరం బిగుసుకుపోకుండా ఉండాలంటే తగినంతగా విటమిన్-బి అవసరం. కండరాల పటుత్వానికి, రోగనిరోధక శక్తి పెరిగేందుకు, చర్మ సంబంధ సమస్యలు తొలగిపోవడానికి విటమిన్-సి దోహదపడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడాలన్నా, శరీరంలో నుంచి వ్యర్థ పదార్థాలు బయటకు పోవాలన్నా ఆహారంలో తగినంతగా పీచు ఉండాలి. శీతాకాలంలో అంతగా దాహం వేయకపోయినా వీలైనంత ఎక్కువగా పరిశుభ్రమైన నీటిని తాగుతుండాలి. నీటిని సరిగా తీసుకోకుంటే డీహైడ్రేషన్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.చలిగాలుల ఫలితంగా చాలామంది శ్వాస సంబంధ సమస్యలతో సతమవుతుంటారు. ఆస్తమా రోగులు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. గొంతునొప్పి, ఆయాసం, దగ్గు, జలుబు నివారణకు మిరియాల కషాయం, అవిసె గింజల కషాయం వంటివి వేడివేడిగా తాగుతుండాలి. తులసి ఆకుల రసం తీసుకున్నా ఫ్లూ జ్వరాలు, దగ్గు వంటివి తగ్గుముఖం పడతాయి. బొప్పాయి ముక్కలు, ఉసిరి, జీలకర్ర వంటివి ఎక్కువగా తింటే చలికాలంలో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీరంలో వేడిని పెంచేందుకు రాగులు, జొన్నలు, కొర్రలతో చేసిన జావలను తాగాలి. గోరువెచ్చటి నీటిలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి తాగితే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మలబద్ధకం, గొంతు సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఐరన్, కాల్షియం పుష్కలంగా లభించే పాలకూరను తింటే ఎముకలకు దృ ఢత్వం వస్తుంది. చలి వేళ ఎముకలు పట్టేసినట్లు అనిపిస్తే తోటకూర, గోంగూర, పాలకూర, కరివేపాకు వంటివి విరివిగా వంటకాల్లో వాడాలి. శరీరానికి వేడిని అందించే నువ్వులు, దుంపజాతి కూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలు, చర్మ సంరక్షణకు ఉపయోగపడేలా ఐరన్, కాల్షియం, పీచు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలున్న ఆహారాన్ని తినాలి. శీతాకాలంలో ఆకుకూరలు మంచివి కావన్న అపోహ చాలామందిలో ఇప్పటికీ ఉంది. అయితే, విలువైన పోషకాలతో మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఆకుకూరలను ఈ కాలంలో విధిగా తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శీతాకాలంలో వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లడం వల్ల ఎంతోమంది అనారోగ్యాల బారిన పడుతున్నారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం, స్నానం..
ఇక, చలికాలంలో ఉదయం వేళ ఆలస్యంగా నిద్ర లేస్తూ చాలామంది వ్యాయామాన్ని పాటించరు. ఏ కాలంలోనైనా తగిన శారీరక శ్రమ ఉంటే బద్ధకం తగ్గి వొంట్లో చురుకుదనం పెరుగుతుంది. ఉదయానే్న నడక లేదా వ్యాయామం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. చర్మానికి తగినంతగా సూర్యరశ్మి అందితే ఎముకలకు మేలు జరుగుతుంది. చలిగాలికి జడిసి స్నానం మానేయడం అనారోగ్యానికి కారణమవుతుంది. రెండు పూటలా స్నానం చేయడం, తగినంతగా మంచినీళ్లు తాగడం చలికాలంలోనూ అవసరమే.
చిరుధాన్యాలతో..
రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాల వినియోగంతో శరీరానికి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింకు, భాస్వరం, కాపర్, ప్రోటీన్లు, పీచు, కొవ్వు పదార్థాలు, లవణాలు తగినంతగా అందుతాయి. వీటి వాడకం రానురానూ గణనీయంగా తగ్గడంతో ఆరోగ్య సమస్యలు అధికం అవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిరుధాన్యాలను విరివిగా తీసుకుంటే మధుమేహం, రక్తహీనత, నేత్ర వ్యాధులు, మలబద్ధకం, కీళ్లనొప్పులు, నరాల బలహీనత, స్ర్తిలలో రుతుసంబంధ సమస్యలు, అధిక రక్తపోటు, అల్సర్లు, కిడ్నీలో రాళ్లు, జీర్ణక్రియ, ఎముకల పటుత్వం, రోగనిరోధక శక్తి వృద్ధి తదితర విషయాల్లో ఎంతోమేలు జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు కూడా చిరుధాన్యాలను తీసుకోవడం అవసరం.
*