రుచి

గొంతు గరగర తగ్గాలంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదీనాలో పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ ఎ, బి, సి, డిలు, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ స్వల్పంగా ఫాట్, కార్బోహైడ్రేట్స్, నీరు లాంటివి లభిస్తాయి. ఈ ఆకు ఔషధపరంగా ఎంతగానో ఉపయోగిస్తుంది.
పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలించినట్లయితే గొంతు గరగర, గొంతు రాపిడికి నివారణ కలుగుతుంది.
పుదీనాను తినటంవల్ల పళ్ళు దృఢంగా ఉంటాయి.
నోటి దుర్వాసనను పోగొడుతుంది.
ఆకలిని వృద్ధి చేస్తుంది. పుదీనా కలిపిన ఆహార పదార్థాన్ని తినడంవలన అజీర్ణాన్ని తొలగించి, జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేస్తుంది.
బాలింతరాలికి చనుపాలు వృద్ధి చెందుతాయి.
వేసవిలో వాడటంవల్ల వేసవి తాపాన్ని పోగొడుతుంది.
కఫాన్ని కరిగిస్తుంది. ఉదర సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.
ముక్కు దిబ్బడ ఏర్పడితే దాన్ని తొలగించడానికి ఆహార పదార్థాల్లో పుదీను చేర్చాలి.
రాత్రి పడక చేరేముందు పుదీనా రసాన్ని ముఖం మీద ఉన్న మచ్చల మీద రాసి ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. మచ్చలు పోయి, చర్మం సహజ రంగులోకి వచ్చేవరకూ ఈ విధంగా చేయాలి.
స్ర్తిలకు నెలసరి సరిగా రాకపోతే ప్రతిరోజూ పుదీనా ఆకులను నమిలితే ఫలితం కనిపిస్తుంది.
ఉదరంలోని నులి పురుగులను సంహరిస్తుంది.
పుదీనా రసంలో పంచదారను చేర్చి, ఔషధంలా తీసుకుంటే కడుపు నొప్పికి ఉపశమనం కలుగుతుంది.
పేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
మరుగుతున్న నీటిలో పుదీనా ఆకులను వేసి, ఆ నీటిలో బట్టను ముంచి కీళ్ళు, కండరాలకు కాపడం పెడితే నొప్పి తగ్గిపోతుంది.
మరుగుతున్న నీటిలో పుదీనా ఆకులను వేసి ఆవిరిపడితే అధిక రొంప భారం తగ్గి జలుబుకు ఉపశమనం కలుగుతుంది.
క్యాన్సర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది.
ఉబ్బస వ్యాధికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
శరీరంలోని విష పదార్థాలను తొలగించడానికి తోడ్పడుతుంది.
మూత్ర విసర్జన చక్కగా జరిగేలా చేసి మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

- కె.నిర్మల