రుచి

ఇవి తింటే రోగాలు దూరం! ( బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహారం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యరంగంలో మనుపెన్నడూ లేనంతగా వైద్య సౌకర్యాలు సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు ఆస్పత్రులకు వెళ్లి వివిధ రకాలుగా చికిత్సలు పొందుతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ తమ రక్త గ్రూపును బట్టి ఆహారం తీసుకుంటే చాలా ఆరోగ్యంగా వుండవచ్చని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉందని, దాన్ని వైద్యుల సలహా మేరకు ఇక్కడ కూడా పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. ప్రతి బ్లడ్ గ్రూప్‌లో ఉండే యాంటిజెన్స్‌కి సరిపడ్డ ఆహారం తీసుకుంటే పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. బరువు కూడా తగ్గవచ్చు. ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ రకమైన ఆటలు ఆడాలో తెలుసుకుందాం.
ఓ: ఓ బ్లడ్‌గ్రూప్ రక్తం కలిగి వున్న వ్యక్తులు మాంసకృత్తులు, కోడిమాంసం, మేక మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే వేరుశెనగ, బఠానీ వంటి నట్స్ వాడితే మేలు. కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు అమితంగా తీసుకోవాలి. పరుగు, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.
ఎ : ఈ రకం బ్లడ్ గ్రూప్ కలిగినవారు కూరగాయలు, బీన్స్, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మాంసం, పాల ఉత్పత్తులను తక్కువగా తీసుకోవాలి. యోగా, నడక వంటి తేలికపాటి వ్యాయామం చేయాలి.
బి : ఈ గ్రూప్ వ్యక్తులు కూరగాయలు, మాంసాహారం, పాల ఉత్పత్తులు ఆహారంగా తీసుకోవచ్చు. టెన్నిస్, స్విమ్మింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్ వంటి టీమ్ గేమ్‌లు ఆడితే మంచిది.
ఎ, బి గ్రూప్ : వీళ్లు కూడా కూరగాయలు, మాంసం రెండూ తీసుకోవచ్చు. కానీ కూరగాయలుకన్నా మాంసాహారం కొంచెం తక్కువగా తినాలి. చేపలు ఎక్కువగా తినాలి. పాల ఉత్పత్తులు అప్పుడప్పుడు తీసుకోవాలి. యోగా, వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
ఇలా చేస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంటుంది.

- నీలిమ సబ్బిశెట్టి