రుచి

శాకాహారంలో ఇవి తప్పనిసరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోషకాలున్న ఆహారం అంటే ఏమిటన్న సంశయం శాకాహారులను తరచూ వేధిస్తుంది. మంచి ఆరోగ్యం కోసం వేటిని తీసుకోవాలన్న ఆలోచన కలిగినపుడు పోషక విలువలపై తగిన అవగాహన ఏర్పరచుకోవాలి. శాకాహారులు తమ ఆహారానికి సంబంధించి ముఖ్యంగా అయిదు విషయాలను గుర్తుంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గింజలు, పాలు, ఆహార ధాన్యాలు, పండ్లు-కూరగాయలు, కాయధాన్యాలు విరివిగా తీసుకుంటే శాకాహారులకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. వేరుశెనగ, బాదం, ఎండుద్రాక్ష, బఠానీలు వంటివి తీసుకుంటే విటమిన్లు, పీచు, ఐరన్, ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. పాలు, పాల పదార్థాల వల్ల ప్రొటీన్లు, విటమిన్-డి, కాల్షియం లభిస్తాయి. శరీరానికి ఖనిజాలు, ప్రొటీన్లు, పీచు, విటమిన్లు సమపాళ్లలో అందాలంటే బీన్స్, చిక్కుడు వంటి కాయధాన్యాలను తరచూ తీసుకోవాలి. ఐరన్, జింక్, కాపర్ వంటి ఖనిజాలతో పాటు తగినంతగా కార్బోహైడ్రేట్లు అందాలంటే గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి ఆహార ధాన్యాలు అవసరం. తాజా పండ్లు, కూరగాయల వల్ల శరీర వ్యవస్థకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.