రుచి

మిక్స్‌డ్ పూరీ అచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదా - 4 కప్పులు, ఏలకులు - 6, శెనగపిండి - 1/2 కప్పు
బియ్యం పిండి - 1/2 కప్పు, నువ్వులు - 1 కప్పు, ఉప్పు -1 చెంచా, బెల్లం - 2 కప్పులు, నెయ్యి - 1/2 కప్పు, పుట్నాలపప్పు, వేరుశెనగపప్పు - 2 కప్పులు, సిల్వర్ పేపర్స్ - 2, ఎండుకొబ్బరి - 1 కప్పు, ముందుగా మైదాలో శెనగపిండి, బియ్యంపిండి, నువ్వులు, కొంచెం నెయ్యి, ఉప్పు వేసుకుని పూరీ పిండిలా కలిపాలి. తరువాత పెద్ద పెద్ద పూరీలుగా వత్తి, వాటిని రిబ్బన్‌లుగా కోసుకోవాలి. కాగిన నూనెలో వేసి వేయించి ఈ రిబ్బన్‌లను పళ్ళెంలో పెట్టండి. ఇలా పిండి అంతా రిబ్బన్‌లుగా వేయించి పళ్ళెంలో వేసి దాన్ని నలపాలి. పొడిగా వస్తుంది. బెల్లం పాకం రానిచ్చి వేయించిన వేరుశెనగపప్పు, పుట్నాలపప్పు పాకంలో పోసి ఎండుకొబ్బరి, పూరీ రిబ్బన్‌ల పొడి వేసి బాగా కలిపి పళ్ళానికి నెయ్యి రాసి ఈ ముద్ద వేసి సర్ది సిల్వర్ పేపర్ అతకాలి. కొంచెం గట్టిపడ్డాక డైమ న్ ముక్కలుగా చేసి విడదీసి పెట్టండి. కరకరలాడే తీపి అచ్చు.