రుచి

వెజిటబుల్ పోహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటుకులు - 4 కప్పులు
క్యారెట్ కోరు - 1 కప్పు
బీన్స్ ముక్కలు - 1/2 కప్పు
కాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు
బంగాళా దుంప ముక్కలు - 1 కప్పు
ఉప్పు - 1 1/2 చెంచా
అల్లం కోరు -2 చెంచాలు
మిర్చి - 5
కరివేప - కొంచెం
నెయ్యి - 2 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ- 2 చెంచాలు
మినప్పప్పు- 4 చెంచాలు
శెనగపప్పు - 4 చెంచాలు
పల్లీలు - 1/2 కప్పు
నిమ్మరసం - 1 కప్పు

విధానం: ముందుగా బాణలిలో నెయ్యవేసి పోపులు వేయించుకోవాలి. దానిలో కూరముక్కలు కడిగి వేసి, ఉప్పు, కొంచెం నీరు పోసి మగ్గించాలి. అటుకులు కడిగి చిల్లుల బుట్టలో వేసి నీరు పోయేవరకు ఉంచి తరువాత మగ్గిన ముక్కల్లో అటుకులు వేసి, కరివేపాకు వేసి కలిపి ఐదు నిమిషాలు ఉంచి దింపాలి. ఉప్పు సరి చూసుకుని కొంచెం చల్లారాక నిమ్మరసం వేసి కలిపి వడ్డించండి. మంచి బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్. నిమ్మరసం పడనివాళ్లు మానెయ్యవచ్చు. దీనికి బదులు నారింజ, దబ్బ రసం కూడా వాడవచ్చును.