రుచి

చాక్లెట్స్‌తో చలాకీగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు వారానికి రెండు పెద్ద డార్క్ చాక్లెట్స్ తింటే బ్రెయిన్ స్ట్రోక్ 20 శాతం తక్కువ వచ్చే అవకాశాలున్నాయని స్వీడిష్ సైంటిస్టులు చెపుతున్నారు. వారానికి సుమరు 66.5 గ్రాముల చాక్లెట్స్ తీసుకోవాలని తెలిపారు. అసలు ఎప్పుడూ చాక్లెట్ తీసుకోని మహిళలను చాక్లెట్స్ విరివిగా రోజుకు మూడుసార్లుగా తినే మహిళలతో పోల్చి చూశారు. తీసుకోనివారికి అతి త్వరగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు కనుగొన్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండే స్వీడిష్ మిల్క్ చాక్లెట్స్ ప్రతివారం తిన్నవారికి, ఏ చాక్లెట్ తిననివారికంటే రిస్క్ చాలా తక్కువ.

చాక్లెట్స్ ఎక్కువగా తినడంవల్ల పళ్లు పాడైపోతాయని కొందరు, లావైపోతామని కొందరు ఇష్టాన్ని చంపేసుకుంటారు. ముఖ్యంగా ఇటీవలికాలంలో ఒబెసిటీ సమస్య ఎక్కువైంది కాబట్టి చాక్లెట్స్ తినాలని ఉన్నా చాలామంది వాటిని దూరం పెడుతున్నారు. కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే చాక్లెట్స్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. లిమోనిన్ అనే పదార్థాన్ని ఈ చాక్లెట్స్‌లో యాడ్ చేయడంవల్ల నోట్లో పెట్టుకోగానే అవి ఈజీగా కరిగిపోతాయట. ఈ చాక్లెట్స్‌లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటంవల్ల లావైపోతామనే బెంగ అవసరం లేదట. చాక్లెట్ అంటే ఇష్టం వున్నవాళ్లు తెగ లాగించేయవచ్చట. చాక్లెట్స్ తినడం ద్వారా ఆరోగ్యంగా.. హుషారుగా ఉండవచ్చని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ముఖ చాకాలజీ కాడ్బరీ స్క్వెప్పెస్ గ్లోబల్ సైన్స్ డైరెక్టర్ పాల్ హెబ్లెత్‌వెయిట్ చాక్లెట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. అవి మనిషి మెదడుకే కాక శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ల నిల్వలను పెంచుతాయని దీంతో ఫ్రీరాడికల్స్‌ను సులువుగా ఎదుర్కోగల శక్తి శరీరానికి వస్తుందని చెప్పారు. అయితే ఎలాంటి చాక్లెట్స్ ద్వారా మనకు మేలు జరుగుతుందనే దానిపై ఇంకా పరిశోధన జరుగుతోందని వెల్లడించారు. అయితే రెడ్‌వైన్ టీ వంటి వాటిని సేవించడం కంటే హాట్ చాక్లెట్స్ తినడం ద్వారా శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల నిల్వలు పెరుగుతాని స్పష్టం చేశారు. డార్క్ చాక్లెట్స్ తినడం ద్వారా పాలీఫెనల్స్ నిల్వలు పెరుగుతాయని తద్వారా శరీరంలోని రోగకారక క్రిములను అరికట్టవచ్చని చెప్పారు. డార్క్ చాక్లెట్స్ తింటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుందట. ఇది ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఈ విషయాన్ని ఫెర్టిలిటీ నిపుణులు సైతం ధృవీకరిస్తున్నారు.
తెలివితేటలు పెరుగుతాయ
చాకొలెట్‌లో ఉండే ఫ్లేవర్స్ కోకో తెలివితేటలు మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చాకొలెట్ డ్రింక్స్ తీసుకున్న వాళ్ల మెంటల్ పెర్ఫామెన్స్ ఎనిమిది వారాల్లో పెరిగిపోయిందట. పరిమితంగా చాక్లెట్ తినే గుణం ఉన్నవారిలో అది పక్షవాతం రిస్క్‌ను 19 శాతం తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, పరిమితంగా చాక్లెట్ తినేవారిలో జ్ఞాపకశక్తి మందగించడంవల్ల వచ్చే డిమెన్షియా కూడా తక్కువే. ఈ గుణం కారణంగా అది భవిష్యత్తులో అల్జీమర్స్ డిసీజ్, రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. చాక్లెట్ ద్వారా లభ్యమయ్యే ఈ ప్రయోజనాలు కేవలం డార్క్ చాక్లెట్స్ లేదా కోకో ఉన్న చాక్లెట్లకు మాత్రమే పరిమితం అయితే పరిమితికి మించి చాకెట్లు తీసుకోవడం స్థూలకాయం వంటి అనేక అనర్థాలకు దారితీస్తుందని గ్రహించాలి. మంచి రుచికరమైన ఒక్క చాక్లెట్ తింటే అలా ఆటోమేటిగ్గా మూడ్ మారిపోతుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు.
చాక్లెట్‌లో ఉపయోగించే కోకోలోని పోషకాల్లో ప్లెవనాల్ ఉంటుంది. అవి అల్జీమర్స్‌ని దూరం చేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు ,యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సురక్షితంగా ఉండేలా చేస్తుంది. బ్యూటీ బెనిఫిట్స్‌లో చాక్లెట్ ఫేషియల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ రుచికరమైన చాక్లెట్ ముఖంలో ఫెయిర్‌నెస్‌ను తెప్పిస్తుంది. చర్మ రంగును మెరుగుపరుస్తుంది. కోకాపౌడర్‌ను పాలు తేనె మరియు ఓట్‌మీల్‌తో మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖం , మెడమీద అప్లై చేసి 15-20 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడంవల్ల ముఖం మెరుస్తుంటుంది. ఇలా కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా చేయడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. చాక్లెట్స్‌లో అంత అద్భుతమైన గుణాలున్నాయి. వయస్సును తెలియనివ్వకుండా చేసే లక్షణం చాక్లెట్స్‌లో అధికంగా ఉన్నాయి. చర్మంలో గురుకుదనం పోయి, చర్మం సున్నితంగా తయారవుతుంది. చాక్లెట్స్‌లో ఫ్యాట్స్ కెఫిన్, కోకా అధికంగా వుండటంవల్ల ఎసిడిటీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్‌కు దూరంగా వుండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్‌కు దూరంగా వుండాలి. లేదంటే మీకు నిద్ర లేకుండా చేస్తుంది.

- వినీతామూర్తి