రుచి

అరటి పండు .. పోషకాలు మెండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికంగా ఎంత ఎదిగినా అనాదిగా వస్తున్న ఆచారాల్లో దాగి వున్న వైజ్ఞానిక రహస్యాలను తెలుసుకుని ఆచరించడం ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. పూర్వకాలంలో ఎక్కువగా అరటి ఆకుల్లోనే భోజనం చేసేవారు. అది సంప్రదాయంతోపాటుగా అందులోనుంచి శరీరానికి అవసరమైన సహజసిద్ధమైన ఔషధాలు లభిస్తాయని అప్పట్లోనే పూర్వీకులు గ్రహించారు.
ప్రస్తుతం ఏ శుభకార్యంలోనైనా, హోటళ్ళలోనైనా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగం ఎక్కువైంది. ఇవి వాడకానికి సులభంగా ఉంటాయి తప్ప ఆరోగ్యానికి మాత్రం తీరని హానిని కలిగిస్తాయి. మనకు అరటి ఆకులు అందుబాటులో ఉంటాయి. వాటిని వినియోగంలోకి తీసుకువస్తే తద్వారా ఆరోగ్యానికి బాటలు వేయవచ్చు. అల్పాహారం అయిన వేడి ఇడ్లీ, దోసె వంటివి శుభ్రం చేసిన అరటి ఆకులో తినడంవల్ల సైతం వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందించగలుగుతాం. తిన్న అరటి ఆకులను బయట వేయడంవల్ల అవి త్వరగా మట్టిలో కలిసిపోయి వాతావరణ కాలుష్యం లేకుండా చేస్తుంది.
అరటి..ఆరోగ్యానికి భరోసా
అరటి ఆకులో భోజనంతో శరీరానికి అవసరమైన సహజసిద్ధమైన పోషక విలువలు అందుతాయి. అరటి చెట్టు నుంచి లభించే అరటి దూట, అరటి పువ్వులోనూ ఎన్నో పోషక విలువలు దాగి వున్నాయి. అరటిలో కొలెస్ట్రాల్ ఒక్క శాతం కూడా ఉండదు. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అరటి దూటలో పీచు పదార్థం అధికంగా వుంటుంది. దీనిని వంటల్లో వినియోగిస్తే మలబద్ధకం, అల్సర్ తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు కరిగించడంలో ఇవి ఎంతో సహకరిస్తాయి. అరటి పువ్వులో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది తినడంవల్ల గుండె సంబంధ వ్యాధులు, రుతుక్రమం సమస్యలు, కేన్సర్ రాకుండా నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. అరటికాయలో కేలరీలు, సోడియం తక్కువగా ఉంటాయి. పొటాషియం, ఎ, బి, సి విటమిన్లు లభిస్తాయి.

- నీలిమ సబ్బిశెట్టి