రుచి

వేడి వేడిగా వెరైటీ వడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రం పూట స్నాక్స్ ఏం చేయాలని ప్రతి గృహిణి తంటాలు పడుతుంది. మంచి హాట్ అంటే వడలనే చెప్పాలి. శెనగపప్పు, మినపప్పులతో కాకుండా బఠాణీ, వేరుశెనగ, బొబ్బరపప్పు, సోయాగింజలతో ఎన్నో రకాలు చేయవచ్చును. సేమ్యా, అటుకులు, ఓట్స్, ఇత్యాది వాటిల్లో కూడా కూరగాయ ముక్కలు కలిపి చేసుకోవచ్చు. విభిన్న వస్తువులతో నోటి కి కర కరలాడే వడలను ఎలా తయారుచేసుకోవచ్చో తెలు సుకుందాం.
మిక్స్‌డ్ వడ
కందిపప్పు, మినప్పప్పు, శెనగపప్పు, నువ్వులు, బియ్యం - 1 కప్పు, మిరియాలు - 6, పుట్నాల పప్పు, బొబ్బరపప్పు - 1/4 కప్పు చొప్పున తీసుకోవాలి, నూనె - 250 గ్రా.,పప్పు - 1 చెంచా,పెరుగు - 1 కప్పు, పచ్చిమిర్చి - 6, ఇంగువ - కొంచెం, ఉప్పు - 2 చెంచాలు, సోంపు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, ముందుగా పప్పులు నానబెట్టి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. దీనిలో ఇంగువ, మిరియాల పొడి, పచ్చిమిర్చి, ఉప్పు, సోంపు, జీలకఱ్ఱ అన్నీ కలిపి ముద్దగా చేసుకోవాలి. తడి ప్లాస్టిక్ పేపర్‌పై వడలుగా చేసి వేయించుకుంటే కరకరలాడుతూ రుచిగా మంచి ఘాటు వాసన కూడా వస్తాయి.
బ్రెడ్ - పెరుగుతో
బ్రెడ్ ముక్కలు - 12, పాలు - 1/2 కప్పు, ఉప్పు - 1/2 చెంచాకొబ్బరి - 2 చెంచాలు, నెయ్యి - 1/2 కప్పు, కొత్తిమీర తరుగు - 2 చెంచాలు, బొంబా యి రవ్వ - 1/2 కప్పు, పెరుగు - 1 కప్పు, పంచదార - 2 చెంచాలు, ఎండుమిర్చి కారం - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 1 చెంచా,
బ్రెడ్ ముక్కలు, బొంబాయి రవ్వ, ఉప్పు, కొత్తిమీర తరుగు పాలు పోసి నానబెట్టాలి. తరువాత దీన్ని ముద్దగా కలుపుకొని పెనంపై నెయ్య వేసి దోరగాబిళ్ళలుగా కాల్చి ప్రక్కన పెట్టుకోవాలి. వాటిని పళ్ళెంలో పేర్చి, పంచదార పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఈ వడలపై పొయ్యాలి. బ్రెడ్ పెరుగు పీల్చుకుని మంచి రుచిగా ఉంటాయి. తియ్యగ కారంగా ఉంటాయి.
సోయాతో..
మైదా - 1 కప్పు, బియ్యపిండి - 1/4 కప్పు, సోయాపిండి - 1/2 కప్పు, ఉప్పు -1 చెంచా, ఉల్లిముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 6, అల్లం తరుగు - 5 చెం చాలు, వేరుశెనగపొడి - 1/2 కప్పు, నూనె - 250 గ్రా., జీలకఱ్ఱ - 2 చెంచాలు, ముందుగా మైదా, బియ్యంపిండి, సోయాపిండి, ఉప్పు, ఉల్లిముక్క లు కలిసి పెట్టుకోవాలి. ఇందు లో మిర్చి, జీలకఱ్ఱ కలుపుకుని వడల పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని నిమ్మకాయంత తీసుకుని వేరుశెనగ పిండిలో ముంచి కాగిన నూనెలో వదిలి కరకర వడలుగా వేయించాలి. ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి.

- వాణి ప్రభాకరి