రుచి

కర్ర పెండలం బిర్యానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనంటికి అతిథులు వస్తే చికెన్ లేదా మటన్ బిర్యానీ స్పెషల్‌గా చేసి పెడతాం. అదే కేరళలో అయతే అతిథుల కోసం కర్ర పెండలం బిర్యానీ వండి వడ్డిస్తారు. వీటితో పాటు హల్వా తదితర వాటిని చేసి బంధుమిత్రులను ఆనందంగా ఆహ్వా నించి పెట్టడం సంప్రదాయం.
బిర్యానీకి కావల్సిన వస్తువులు
బియ్యం (సన్నటి రకం) 2 కప్పులు, నెయ్యి - 1 కప్పు,కొబ్బరి తురుము - 2 చెంచాలు, మసాలా ఆకులు - 4,ఏలకులు - 6,దాల్చిన చెక్క - 4, లవంగాలు - 6, కుంకుమ పువ్వు - 1 చెంచా, పాలు - 1/2 కప్పు, వేయించిన ఉల్లి ముక్కలు - 1 కప్పు, పుదీనా ఆకులు - 1/2 కప్పు, కొత్తిమీర తరుగు - 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు, జీలకఱ్ఱ - 1 చెంచా, సోంపు - 1 చెంచా, కర్రపెండలం - పెద్ద సైజు ముక్కలు - 4 కప్పులు నూనె - 1 కప్పు
ముందుగా కర్ర పెండలం దుంప తొక్క తీసి ఉప్పు పసుపు రాసి పక్కన పెట్టాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గసగసాలు, జీలకఱ్ఱ, సోంపు నూరి ముద్దగా చేసుకోని ప్రక్కన పెట్టాలి. ఉల్లి ముక్కలను, జీడిపప్పులు,కర్రపెండెలం ముక్కలు ఒకసారివేయించి ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పు బాణలిలో నెయ్యి వేసి ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా,అల్లం, వెల్లుల్లి, కొబ్బరి మిశ్రమం ముద్ద వేసి వేయించాలి. బఠాణాలు వేసి కలిపి నాలుగు కప్పుల నీరు పోసి వేగాక పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బియ్యం పోసి మూత పెట్టాలి. ఇది ఉడికిన వాసన వస్తుండగా బాగా కలిపి దీనిలో వేయించి పెట్టుకున్న కర్ర పెండలం ముక్కలు, వేయించిన ఉల్లిపాయలు జల్లి దింపాలి. వడ్డించే ముందు బాగా కలిపి డిష్‌లో తీసుకుని వడ్డించాలి.
**
కేరళ హల్వా
బియ్యం - 4 కప్పులు, నెయ్యి - 2 కప్పులు, కొబ్బరిపాలు - 4 కప్పులు, బెల్లం - 3 కప్పులు, ఏలకులు - 12, జీడిపప్పులు - 24, బాదం పప్పులు - 24, పిస్తా పప్పు - 24, కుంకుమ పువ్వు - 1 చెంచా
ముందుగా నానబెట్టిన బియ్యం వాడేసి గ్రైండర్‌లో మెత్తగా రుబ్బి నీళ్ళు పోసి పాల మాదిరిగా వడగొట్టాలి. ఇలా బాగా మెత్తని చిక్కని బియ్యం పాలను స్టౌపై వెడల్పు గినె్నలో పోసి ఉడికించాలి. దానిలో కప్పు నెయ్యి కొబ్బరిపాలు చేర్చి కోవా మాదిరి దగ్గర పడనివ్వాలి. దీనిలో బెల్లం మిగతా నెయ్యి, ఏలకుల పొడి చేర్చి బాగా దగ్గరపడేదాకా కలుపుతూ ఉండాలి. దీనికి వేయించిన పప్పులు, కుంకుమ పువ్వు అన్నీ చేర్చి గినె్న నుంచి మిశ్రమం విడిపోయేలా చూడాలి. ఇపుడు పళ్ళానికి నెయ్యి రాసి మిశ్రమం పోసి సర్దాలి. బాగా ఆరనిచ్చి గట్టిపడ్డాక ముక్కలుగా చేసుకోవాలి. ఇది వారంపైగా నిల్వ ఉంటాయి.
*

- వాణి ప్రభాకరి