రుచి

మేలు చేసే శనగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంద గ్రాముల శనగల్లో పిండి పదార్థం, కొవ్వు, మాంసకృతులు, ఇనుము, కాల్షియం, పీచు సమృద్ధిగా లభిస్తాయి. వీటిల్లోని మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో సాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చిన్నారులకు ప్రతిరోజూ వీటితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని స్నాక్స్ రూపంలో ఇవ్వడం ఎంతో మంచిది.
శనగల్ని నిత్యం తీసుకుంటే గుండెకు రక్తం సక్రమంగా సరఫరా అవుతుంది. వీటిలోని పోషకాలు గుండెకు బలాన్ని చేకూర్చుతాయి. వయసు పెరుగుతున్న వారు శనగల్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే మంచిది. బరువు తగ్గాలనుకున్నవారికీ ఇది సరైన ఆహారమే. ఎందుకంటే వీటికి కొవ్వును కరిగించే శక్తి ఉంటుంది. శనగల్లో ఉండే ఫోలేటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
సాధారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో రక్తహీనత ఒకటి. శనగల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది. రోజూ వీటిని తినడంవల్ల శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది. ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. రక్తహీనత దూరమవుతుంది. రక్తపోటుతో బాధపడేవారికి ఇవెంతో మేలు చేస్తాయి. అందుకే వీటితో కూర, పులుసు, పాటోళీ వంటివి చేసుకోవచ్చు.
మధుమేహం ఉన్నవారికి శనగలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్ని అదుపు చేస్తాయి. వీటిల్లో పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి వంటివి బాధించవు.

-నీలిమ సబ్బిశెట్టి