రుచి

మేలు చేసే మెంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్య జీవితంలో మనం మెంతులు వాడడం ఎంతో ప్రయోజనకరం. మెంతులు పాలిచ్చే తల్లులకు మేలు చేస్తాయి. వారి స్తన్యంలో పాలు పెరుగుదలకు దోహదపడతాయి. మెంతులలో అధికంగా పీచుపదార్థం వుండడంవలన మలబద్ధకం, డయోరియా దరిజేరవు.
మధుమేహం నివారణలో మెంతులు ఎంతో ఉపయోగపడతాయి. మెంతులు రాత్రివేళలో నానబెట్టి ఉదయం వేళలో ఆ నీటిని త్రాగితే ఆరోగ్యకరం. మెంతులు రోజూ కొన్ని తినడం వలన రోగాలు రావు.
మెంతులులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా వున్నాయి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించే గుణం మెంతులులో వుంది. జుట్టు రాలిపోవడం అరికడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే గుణం వుంది. చుండ్రు నివారణకు మెంతిపిండి చక్కగా పనిచేస్తుంది. మెంతిపిండి స్ర్తిల సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. మెంతిపిండి చర్మంపై రాసుకుంటే చక్కటి కాంతిదనం లభిస్తుంది.
నీటిలో మెంతులు నానబెట్టి అందులో శెనగపిండి, పెరుగు కలిపి చర్మంపై రాసుకోవాలి. దీనివలన చర్మంపై వుండే నల్లని వలయాలు తగ్గుతాయి. సూర్యకిరణాలు తాకిడికి కమలిపోయిన చర్మానికి సరైన చికిత్స మెంతిపిండి వాడకం. మెంతికూర కూరల్లో ఉపయోగిస్తారు. మెంతాకు పప్పు చాలా రుచికరంగా వుంటుంది. గుండె మంటను మెంతుల తగ్గిస్తాయి. చుండ్రు నివారణకుగాను రాత్రంతా మెంతులను నీటిలో నానబెట్టి రుబ్బి పెరుగుతో కలిపి తలకు పట్టించాలి. అరగంట అయ్యాక తల శుభ్రంగా కడుగుకోవాలి. చుండ్రు నివారణతో మెంతులు మేలిగా పనిచేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడేందుకు చక్కటి గుణాలున్న మెంతులు వాడకం మంచిది. ఆయుర్వేద శాస్త్రంలో మెంతుల ప్రాధాన్యత చక్కగా వివరించారు. మెంతాకు ప్రతిరోజు ఉపయోగించడంవలన మేలు జరుగుతుంది. స్ర్తిల సౌందర్య సాధనంలో మెంతులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. విటమిన్ బి3, నియాసిన్ పోషకాలు మెంతులలో అధికంగా లభిస్తాయి.

-ఎల్.ప్రపుల్ల చంద్ర