రుచి

కూరగాయలతో శాండ్‌విచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాస్ట్ఫుడ్‌కు అలవాటుపడుతున్న పిల్లలను కట్టడి చేసి ఇంట్లోనే రకరకాల బర్గర్లు, శాండ్‌విచ్‌లు చేసి పెట్టవచ్చు. బ్రెడ్‌లు ఎలాగూ దొరుకుతాయి. మనింట్లో వండిన కూరలు, పచ్చళ్లు ఉంటే, వెన్న రాసిన బ్రెడ్ మధ్యలో పెట్టి వీటని సులభంగా తయారుచేసి పిల్లలకు పెట్టవచ్చు. కూరగాయ, పండ్ల ముక్కలతో రుచికరమైన శాండ్‌విచ్‌లను ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం...
పనీర్‌తో..
బ్రెడ్ స్లైసులు - 12, పన్నీర్ - 100 గ్రా., మైదా - 5 చెంచాలు
మొలకెత్తిన పెసలు - 1/2కప్పు, టమోటా సాస్ - 1 1/2 టీ.స్పూన్, ఉప్పు - తగినంత, గరకు మసాలా పొడి , మిర్చి - 2, మిరియాల పొడి - 1/2 చెంచా, వెన్న - 1/2 కప్పుష విధానము: ముందుగా పన్నీరు తురుము మైదా, టమోటా సాస్, ఉప్పు, గరమ్ మసాలా, మిర్చి ముక్కలు మిరియాల పొడి అన్నీ కలిపి రెండు బ్రెడ్ ముక్కల మధ్య పెట్టి శాండ్‌విచ్ టూస్టర్ పెట్టి కాల్చాలి. దీన్ని బయటకు తీసి నచ్చిన ఆకృతిలో ముక్కలు చేసుకోవాలి.
క్యారెట్‌తో..
క్యారెట్ కోరు - 2 కప్పులు, ఉల్లి ముక్కలు - 1/2 కప్ప, అల్లం మిర్చి పేస్ట్ - 2 చెంచాలు, టమోటాలు - 2, తురిమిన పుదీనా - 1/2 కప్పు, వెన్న - 1/2 కప్పు,బ్రెడ్ ముక్కలు - 8, కొబ్బరి కోరు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 1/2 చెంచా ఆవాలు - 1/2 చెంచా, బాణలిలో వెన్న కొంచెం వేసి పోపులు వేయించి ఉల్లి ముక్కలు వేయించి, క్యారెట్ కోరు, కొబ్బరి కోరు వేసి మగ్గనివ్వాలి. దానికి టమోటా రసం పుదీనా వేసి కలిపి దింపాలి. బ్రెడ్ ముక్కలకి వెన్న రాసి ఈ మిశ్రమాన్ని రెండింటి మధ్యలో పెట్టి టూస్ట్ చేసి తియ్యాలి.
బంగాళాదుంపతో
ఉడికించిన బంగాళాదుంపలు - 4, బ్రెడ్ ముక్కలు - 8, అల్లం వెల్లుల్లి, మిర్చి, జీలకఱ్ఱ నూరిన ముద్ద - 5 చెంచాలు, ఉప్పు - 1/2 చెం చా, బ్రెడ్‌లు - 8, వెన్న - 1/2 కప్పు, నిమ్మరసం - 1/2 కప్పు, విధానము:ముందుగా బంగాళాదుంప పొడి చేసి బాణలిలో వెన్న వేసి పోపులు వేయించి బంగాళదుంపలు వేసి కలిపి నిమ్మరసం చేర్చి కలపాలి. బ్రెడ్ ముక్కలకి వెన్నరాసి కూర పెట్టుకొన్న టూస్ట్‌లో పెట్టి తియ్యండి. శాండ్‌విచ్ రెడీ!
వెజిటబుల్
బ్రెడ్ ముక్కలు - 8, దోసకాయ ముక్కలు - 6, క్యారెట్ ముక్కలు - 6, మిరియాల పొడి - 1 చెంచా, ఉప్పు - 1/2 చెంచా, జీలకఱ్ఱ - 1 చెంచా, అల్లం - కొంచెం, కొత్తిమీర - కొంచెం, వెన్న - 1/2 కప్పు, కూరగాయ ముక్కలు ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దను వెన్న రాసిన బ్రెడ్ ముక్కలకి ఈ చట్నీ పూసి బ్రెడ్ ముక్క అదమాలి. ఇలా రెండు మూడు ముక్కలు అమర్చి అంచులు నొక్కి శాండ్‌విచ్ టూస్టర్‌లో పెట్టుకొని తయారుచేసుకోవాలి.

-వాణిప్రభాకరి