రుచి

కమలా పండుతో కమ్మగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిట్రస్ జాతికి చెందిన కమలాఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. కమలా రసంలో కొంచెం ఉప్పు, కొంచెం పంచదార కలిపి తిన్నా బాగుంటుంది. మంచి వ్యాధి నిరోధక శక్తి కలిగిన కమలా పండు నేడు మార్కెట్లో విరివిగా దొరు కుంది. కమలాల తొక్కను ఎండబెట్టి పొడి చేసి నీళ్లలో కలిపి స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. దీనితో హల్వా, తొక్కల పచ్చడి, పెరుగుతో సలాడ్ కూడా చెయ్యవచ్చు. కస్టర్డ్ ఇంకా బాగుంటుంది.
హల్వా
చిన్న రవ్వ - 1కప్పు,2 కాయల తొనలు , పుట్నాల పొడి - 1కప్పు,నెయ్యి - 5 చెంచాలు,ఏలకులు - 5,కొబ్బరి కోరు - 2 చెంచాలు,జీడిపప్పు - 12,కిస్‌మిస్ -12,పంచదార - 1 కప్పు, ముందుగా బాణలిలో నెయ్యి వేసి పప్పులు వేయించాలి. ఈ బాణలిలో నాల్గు కప్పుల నీరు వేసి మరిగాక రవ్వ వేసి ఉడికించాలి. దీంట్లో పంచదార, నెయ్యి ఏలకులు వేయాలి. తరువాత పంచదార, నెయ్యి వేసి ఉడకనివ్వాలి. కిస్‌మిస్‌లు, కొబ్బరికోరు, జీడిపప్పులు అన్నీ చేర్చి కలిపి దింపాలి. కొంచెం చల్లారాక దీనిలో వలచిన కమలా తొనలు పెట్టి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. గంట తరువాత తీసి కప్పుల్లో వడ్డించండి.
యోగర్ట్‌తో
వలిచిన తొన లు - 2 కప్పులు, పెరుగు - 4 కప్పులు, బెల్లం - 1/2 కప్పు, పంచదార - 1/2 కప్పు, ఏలకులు - 5, పుట్నాలపొడి - 1 కప్పు, జీడిపప్పు - 24, కిస్‌మిస్ - 24, ముం దుగా కమలా తొనలు సన్నని పొరలు తీసి ఒక బౌల్‌లో వేసి బెల్లం పొడి, పంచదార పొడి, పుట్నా ల పొడి పెరుగు అన్నీ కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. బయటకు తీసి జీడిపప్పులు, కిస్‌మిస్‌లు అన్నీ పేర్చి కప్పుల్లో పెట్టుకుని తింటే రుచిగా ఉంటుంది.

- వాణీ ప్రభాకరి