రుచి

వేసవిలో .. ఇవి మంచివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకరకాల పళ్లు వేసవి కాలం లో విరివిగా దొరుకుతాయి. తాజా పండ్లతో జ్యూస్‌లుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎండవేళ తాగతే సేదతీరుతుంది. చల్ల దనాన్ని ఇచ్చే పండ్ల రసాలలో బయట కెమికల్స్ వాడుతున్నారు. ఇవి వాడకుండా రెండు మూడు రోజులు నిలువ వుండేలా తయారుచేసుకుంటే మం చిది. వివిధ రకాల జ్యూస్‌లు ఎలా తయారుచేసుకోవచ్చు తెలుసుకుందాం.
ద్రాక్షతో: ద్రాక్షపళ్లు-250గ్రా, పెరుగు-2 కప్పులు, ఉప్పు-అర చెంచా, పంచదార-2 చెంచాలు, నిమ్మరసం-2 చెక్కలది. ద్రాక్షపళ్లులోని గింజలు తీసి ఉప్పు, పంచదార, పెరుగు వేసి మిక్సీపట్టాలి. ఇందులో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌లో ఉంచితే బాగుంటుంది.

పచ్చి మామిడి కాయతో: పచ్చి మామిడి కాయ ముక్కల్లో నీరుపోసి ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టిన ముక్కల గుజ్జు-2 కప్పులు, మామిడి పండ్లు అయితే 4కప్పుల ముక్కలు లేదా గుజ్జు. పంచదార-అర కప్పు, ఉప్పు-1 చెంచా, మజ్జిగ-5 కప్పులు, కరివేపాకు కొంచెం. ముందుగా మామిడి గుజ్జులో పంచదార, ఉప్పు, మజ్జిగకి కలిపి మిక్సీ పట్టాలి. ఇది ఫ్రిజ్‌లో పెట్టి కావాల్సినప్పుడు తాగవచ్చు. 2 రోజులు మించి ఉంచరాదు.

సపోటాతో: సపోటాలు-24, పాలు-1 లీటర్, పంచదార-అరకప్పు, ఏలకులు-6 ముందుగా పాలు కాచి చల్లార్చి దానిలో సపోటా గుజ్జు, పంచదార, ఏలకులు వేసి మిక్సీ పట్టాలి. ఇలా తయారైన జ్యూ స్‌పై కొబ్బరితో అలంకరించి ఇస్తే బాగుంటుంది.

బాదం పాలు: పాలు- 2 లీటర్లు, మాస్ బాదం పొడి- 1/2 కప్పు, జీడిపప్పులు-24, బాదం పప్పు-24, పంచదార-2 కప్పులు, ఏలకులు-5, కొబ్బరి కోరు-2 చెం చాలు, దాల్చిన చెక్కపొడి- 1 చెంచా. ముందుగా పాలు కాచి బాదం పౌడర్ కరిగించి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, ఏలకులు, దాల్చిన చెక్కపొడి కలిపి, ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లారాక ఎండ వేళ తాగాలి. బలవర్ధకమైన డ్రింక్ ఇది.

- వాణిప్రభాకరి