రుచి

కారం కారంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు బ్రెడ్ తినడానికి ఇష్టపడరు. బ్రెడ్‌లో రకరకాల కూరలు, మొలకెత్తిన విత్తనాలు, పళ్లు కూరగాయలతో టోస్ట్‌లు చేసిపెడితే ఇష్టంగా తింటారు. పెనంపై కాల్చేవారు. ప్రత్యేకమైన టోస్టర్లు వచ్చాయి.
టమాటాతో..
కావల్సినవి : బ్రెడ్ స్లయస్ లు-8, ఎర్రగా పండిన టమాటాలు -4, ఉల్లి ముక్కలు- 1/2 కప్పు, కొత్తిమీర కొంచెం, మిర్చి-2, ఉప్పు-1/4 చెంచా, పంచదార-1/2 చెంచా, గరం మసాలా-2చెంచాలు, నెయ్యి-5 చెంచాలు, జీలకర్ర-1 చెంచా, ఆవాలు-1 చెంచా
బ్రెడ్ ముక్కలకు రెండు పక్కల నెయ్యి రాసి ఉంచాలి. బాణలిలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర వేయించి టమాటా ముక్కలు ముద్దగా నూరినది తీసి ఉడకనివ్వాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కకి టమాటా గుజ్జు పట్టించి పెనంపై కాల్చండి. లేదా టోస్టరు బాక్సులో పెట్టి కాల్చాలి. రెండు మూడు విజిల్స్‌కు టోస్ట్
తయారవుతుంది. ఆ తరువాత బయటకు తీసి క్రాస్‌గా ట్రయాంగిల్ ముక్కలు చేసి వడ్డించాలి. కరెంటు టోస్టర్లతోను చేయవచ్చును. బ్రేక్ ఫాస్ట్‌గా మంచివి.
మసాలాతో..
బ్రెడ్ స్లయస్‌లు-8, వెన్న-4 చెంచాలు..చట్నీకి: అల్లం-చిన్నముక్క, వెల్లుల్లిరేకులు-6, జీలకర్ర-2 చెంచాలు, పచ్చిమిర్చి-4, ఉప్పు- కొంచెం, పుట్నాల పప్పు-1 కప్పు, వేరుశనగపప్పు-1/2 కప్పు, చింతపండు రసం-4 చెంచాలు, పుదీనా తరుగు-1 కప్పు, కొత్తిమీర- కొంచెం
ముందుగా కొంచెం నెయ్యి బాణలిలో వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, పుట్నాలపప్పు లేదా శనగపప్పు వేయించి పుదీనా తరుగు, కొత్తమీర తరుగు వేసి 5 నిముషాల మగ్గించి మిక్సీపట్టాలి. ఇపుడు బ్రెడ్‌కి ఒకవైపు వెన్నరాసి పచ్చడి పల్చగా చేసి రెండు టోస్ట్‌ర్‌లో పెట్టి కమ్మని వాసన వస్తుండగా ఆఫ్ చేయాలి. ట్రయాంగిల్ ముక్కలా చేయాలి.
పెసరపప్పుతో..
పెసరపప్పు-1 కప్పు, మిర్చి-2, అల్లం తరుగు-2 చెంచాలు, మామిడి కోరు-1/2 కప్పు, కొబ్బరికోరు-1/2 కప్పు, ఉప్పు కొంచెం, జీలకర్ర-1 చెంచా, చక్కెర-1/2 చెంచా, కొత్తిమీర కొంచెం, బ్రెడ్ స్లయస్‌లు-8, వెన్న-5 చెంచాలు
నానిన పెసరపప్పులో అల్లం మిర్చి మామిడి కోరు, కొబ్బరి కోరు ఉప్పు జీలకర్ర, చక్కెర, కొత్తిమీర చేర్చి ముద్దగా రుబ్బాలి. దీన్ని బ్రెడ్‌ముక్కకి రాసి రెండు కలిపి నొక్కి టోస్టరులో వుంచాలి. కమ్మని వాసన వస్తుండగ తీయాలి. ఇది తియ్యగా,కారంగా ఉంటుంది.
పాలకూరతో..
పాలకూర తరుగు- 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్-2 చెంచాలు, బ్రెడ్ ముక్కలు-12, వెన్న-5 చెంచాలు, ఉప్పు-1/2 చెంచా, క్యారట్ కోరు-1/2 కప్పు, జీలకర్ర-1 చెంచా
బాణలిలో వెన్న వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్ని పేస్టు వేయించి పాలకూర తరుగు ఉప్పు వేసి మగ్గనివ్వాలి. దానిలో క్యారెట్ వేసి కొంచెం మగ్గాక దింపి మిక్సీ పట్టాలి. ఈ ముద్దని బ్రెడ్‌కి పూసి టోస్టర్‌లో పెట్టాలి. ఇది కాలాక తీసి విడదీసి రెండు ముక్కలుగా చేసుకుని వడ్డించాలి. స్వీట్ టోస్ట్‌లు
చెర్రీ ముక్కలు-24, ద్రాక్షపళ్లు-24, పచ్చి ఖర్జూరం ముద్ద 1 కప్పు, వెన్న-1/2 కప్పు, పంచదార-1/2 కప్పు, బ్రెడ్‌ముక్కలు-8, జీడిపప్పు ముక్కలు-24, బాదం పప్పు ముక్కలు-24, కుంకుమపువ్వు-కొంచెం, ఏలకులు-6
ముందుగా ద్రాక్ష ముక్కలు, ఖర్జూరము, చెర్రీ ముక్కలు జీడిపప్పు ముక్కలు, పంచదార వెన్న అన్నీ కలిపి ముద్దగా చేసుకోవాలి. బ్రెడ్‌కి వెన్న రాసి ఈ స్వీటు ముద్ద రాసి బ్రెడ్‌తో నొక్కి టోస్టరులో పెట్టిటోస్టు చేసుకోవాలి. రాత్రి కూర చేసుకుని ఉదయానే్న ఆ కూరను బ్రెడ్ మధ్యలో పెట్టుకుని టోస్ట్ రెడీ చేయవచ్చు.

-వాణీ ప్రభాకరి