రుచి

కారప్పూసలో కొన్నిరకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు, పెద్దలు మధ్యాహ్నం వేళ స్నాక్స్‌గా తీసుకునే ఐటెమ్సెలో కారప్పూస ఉంటే అమితంగా ఇష్టపడతారు. పిల్లలకు చిరుతిండిగా చిటికెలో చేసేయ్యవచ్చు. శనగపిండితో బలవర్థమైన తృణధాన్యల పిండితో వీటిని తయారుచేసుకుంటే పిల్లలకు ఆరోగ్యరీత్యా కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా రాగిపిండి,
సోయాపిండి, శనగపిండి, బఠాణీపిండిలతో రుచికరంగా చేసి డబ్బాల్లో పెడితే 15 రోజులవరకూ నిల్వ ఉంటాయి.

వాము కారప్పూస
శెనగపిండి - 6 కప్పులు, వాము - 4 చెంచాలు, ఎండుకారం - 4 చెంచాలు, అల్లం రసం - 5 చెంచాలు, బియ్యంపిండి - 5 చెంచాలు, నూనె - 250 గ్రా., ఉప్పు - 4 చెంచాలు, నెయ్యి - 2 చెంచాలు, ముందుగా వాము నేతిలో వేయించి శెనగపిండి
బియ్యంపిండి, ఎండుకారం, అల్లం రసం అన్నీ కలిపి ముద్దగా వేడి నీటితో కలపాలి. నూనె కాగాక నూనెలో సన్నటి బిళ్లలతోచుట్టి వదలాలి. నూనె వేడి భరించలేనివారు చిల్లుల చట్రంపై చుట్టి నూనెలో పెడితే అది విడిపోతుంది.
సోయాపిండితో..
సోయాపిండి - 2 కప్పులు, బియ్యం పిండి - 1 కప్పు, శెనగపిండి - 1 కప్పు, నూనె - 250 గ్రా., ఉప్పు - 2 చెంచాలు, పచ్చిమిర్చి రసం - 1 కప్పు, వాము - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, ముందుగా పైన చెప్పిన పిండి రకాలను మెత్తగా చేసుకుని ఉంచుకోవాలి. ఈ పిండుల్లో జీలకఱ్ఱ, వాము, ఉప్పు, మిర్చి రసంతో కలుపుకోవాలి. నూనె కాచి పిండిని పెద్ద చట్రంపై చుట్టి కాగిన నూనెలో వదిలి వేగాక తీసి పళ్ళెంలో పెట్టాలి. ఇలా మొత్తం పిండి అంతా కారప్పూసగా చుట్టుకోవాలి.
రాగిపిండితో
రాగిపిండి - 2 కప్పులు, శెనగపిండి - 1/2 కప్పు, బియ్యంపిండి - 1 1/2 కప్పు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, నూనె - 250 గ్రా. ఉప్పు - 3 చెంచాలు, కారం - 5చెంచాలు, మసాలా పొడి - 2 చెంచాలు
రాగిపిండిలో పై పదార్థాలన్నీ కలిపి నూనె కాగిన తరువాత చట్రంపై చక్రాలుగా చుట్టి నూనెలో వదలాలి.
ఇవి బాగా వేగాక తీసి పళ్ళెంలో పెట్టాలి. కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉంటుంది.
మైదాపిండితో
మైదా పిండి - 2 కప్పులు, బియ్యంపిండి - 2 కప్పులు, నువ్వుల పొడి - 1/2 కప్పు, నూనె - 250 గ్రా., ఉప్పు - 2 చెంచాలు
మైదాపిండి గుడ్డలో కట్టి ఆవిరి కుడుము ప్లేట్లపై పెట్టాలి. తరువాత బయటకు తీసి ఉప్పు, బియ్యంపిండి కలిపి ముద్దగా చేసుకుని చక్రాలుగా చుట్టుకుని కాగిన నూనెలో వేయించి తీసి పెట్టాలి. ఇది నెల రోజులకు పైగా నిల్వ ఉంటుంది. -

వాణీప్రభాకరి