రుచి

కాఫీలోనూ బొమ్మ‘లాటే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాఫీ గింజల డికాషన్ పాలు, పంచదారల తో కలగలిసి చక్కగా, చిక్కగా తయారయ్యే అమోఘమైన కాఫీని తయారుచేయడాన్ని కూడా ఒక కళగా చెబుతుంటారు. కాఫీని చూసేందుకూ కూడా కళాత్మకంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటివారిని మెప్పించేందుకే ‘లాటే ఆర్ట్’ ఆవిర్భవించింది. కాఫీ కప్పులో వివిధ కళాత్మక రూపాలను పాల నురగతో ఆవిష్కరించడానే్న ‘లాటే ఆర్ట్’గా పిలుస్తారు. ఇటలీలో మొదటగా వెలుగులోకి వచ్చిన లాటే ఆర్ట్ అమెరికాకు విస్తరించింది. అనంతరం భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రాచుర్యాన్ని పొం దింది. సాధారణంగా డికాషన్, పాల మిశ్రమంగా కాఫీ తయారవుతుంది. లాటే ఆర్ట్‌కోసం ఉపయోగించే కాఫీకి మాత్రం ముందుగా డికాషన్ పోసి అనంతరం ఒక పొరలా పాల నురగను పరుస్తారు. ఆపైన క్రీమ్ లేదా మిల్క్ చాక్లెట్‌లను పోస్తారు. అనంతరం వాటిపై వివిధ రకాల ఆకృతులను ఆవిష్కరిస్తారు.
అయితే సాధారణంగా చేతితో కలిసిన కాఫీపై ఇలాంటి ఆకృతులను సృష్టించడం సాధ్యం కాదు. కేవలం యంత్రాల సాయంతో తయారుచేసే వేడి కాఫీపైనే ఈ తరహా కళారూపాలను ఆవిష్కరించడం సాధ్యమవుతుంది. కాఫీ కప్పును కళాత్మకంగా తీర్చిదిద్దే లాటే ఆర్ట్‌లోనూ రెండు ముఖ్యమైన రకాలున్నాయి. అవి ఫ్రీ పౌరింగ్, ఎచింగ్. కాఫీ కప్పుపై క్రీమ్ లేదా మిల్క్ చాక్లెట్‌లను పోసిన తరువాత ఒక పాత్ర లో పాల నురగను తీసుకొని దాన్ని కాఫీ కప్పుపై ఒక ఆకృతిలో వచ్చేలా పోయడమే ఫ్రీ పౌరింగ్. ఇక కాఫీ కప్పుపై పరిచిన క్రీమ్‌పై ఒక సన్నటి టౌత్‌పిక్ లేదా పదునైన కొన ఉన్న ఏదైనా వస్తువుతో వివిధ ఆకృతులను ఆవిష్కరించడాన్ని ఎచింగ్‌గా పిలుస్తారు. స్నేహితులకు శుభకాంక్ష లు కూడా చాలామంది కాఫీ కప్పుతోనే చెప్పేస్తున్నారు. అంతేకాదు ‘ఐ లవ్ యూ’ అని కాఫీపై రాయిం చి కొందరు ప్రపోజ్ చేస్తుంటే, ప్రేయసి బొమ్మను కాఫీపై వేయించేవారు మరికొందరు. అందుకే ప్రస్తుతం ‘లాటేఆర్ట్’లో నైపుణ్యం వారికి కాఫీ షాప్‌లలో డిమాం డ్ ఎక్కువగా ఉంది. పొగలు కక్కే కాఫీ తో బ్రాండెడ్ కాఫీ షాప్‌ల మధ్య పోటీ కూడా పెరిగింది. కేవలం కాఫీని అందించడమే కాక కాఫీ కప్పుకు మరిన్ని హంగులు జోడించడానికి ‘లాటే ఆర్ట్’ మరింత కళాత్మకంగా కాఫీని మనకందిస్తోంది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఇ్ద్య్యౄజర్ఘీబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈ కింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి