రుచి

గోధుమ పిండితో వెరైటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోధుమ పిండితో మనం ఎక్కువగా పుల్కాలు, పూరీలు, చపాతి, పరోటాలు చేస్తుంటాం. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే కొన్ని వంటకాలు చేసుకోవచ్చు. రోజు రోజుకు మధుమేహగ్రస్తులు పెరుగుతుండటంతో రైస్ కన్నా గోధుమలతో చేసిన వంటకాలు ఎక్కువగా చేసుకుంటున్నారు. గోధుమ పిండితో లడ్డులు, తీపి దోశె, కారం దోశె, తీపి పొంగడాలు, కారం పొంగడాలు, మడత పూరీలు, కాజాలు వంటివి చేసుకోవచ్చును.
లడ్డూలు
మెత్తని గోధుమ పిండి - 4 కప్పులు
మెత్తని పంచదార -3 కప్పులు
నెయ్యి - 2 కప్పులు
ఏలకులు - 8, జీడిపప్పులు - 16, బాదం పప్పులు - 16,
కిస్‌మిస్‌లు - 24, ఎండుకొబ్బరి - 1 కప్పు
ముందుగా గోధుమ పిండిని దోరగా నెయ్యి కొంచెం వేసి వేయించాలి. నేయి వేసి కొబ్బరి దోరగా వేయించాలి. బాదం, జీడిపప్పు దోరగా వేయించి ఏలకులు చేర్చి మెత్తగా మిక్సీ పట్టాలి. అన్నీ కలిపి ఈ పిండిలో చేర్చి బాగా కలపాలి. మిగతా నెయ్యి చేర్చి లడ్డూలుగా కట్టుకోవాలి. మెత్తగా ఉండే ఈ లడ్డూలు ఆరోగ్య రీత్యా చాలా మంచిది.

కారం పొంగడాలు
బియ్యం పిండి - 1 కప్పు, గోధుమ పిండి - 2 కప్పులు, ఉప్పు - 2 చెంచాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు, అల్లం మిర్చి పేస్ట్ - 4 చెంచాలు, నూనె - 1/2 కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సోడా - 1/2 చెంచా
ముందుగా ఈ పిండి కలిపి ఒక గంట నానబెట్టి ఉంచాలి. పొంగడాలు గుంటకు నూనె రాసి వీటిని పోసి మూత పెట్టాలి. ఇదీ దోశె అయితే పెనానికి నూనె రాసి దోశె సర్ది ఉల్లి ముక్కలు జల్లి రెండువైపులా దోరగా వేయంచుకోవాలి.
వివిధ రకాల స్నాక్స్
గోధుమ పిండి - 4 కప్పులు
వెన్న - 1 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
వాము - 2 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
సోడా - 1 చెంచా
ఈ పిండిలో అన్నీ కలిపి ముద్దగా చేసి రెండు గంటలు నానబెట్టి పెద్ద పూరీగా వత్తి మార్క్‌తో బిస్కెట్‌గాను, కాజాలుగాను, పూరీలు, గవ్వలుగాను చేసుకోవచ్చు.
తియ్యటి దోశెలు
గోధుమ పిండి - 2 కప్పులు, బియ్యం పిండి - 4 చెంచాలు,
మెత్తని బెల్లం - 1 కప్పు, ఏలకులు - 5, కొబ్బరికోరు - 5చెంచాలు, జీడిపప్పు, బాదం పప్పులు పొడి - 5 చెంచాలు, ఏలకులు - 5, కొబ్బరి కోరు - 5 చెంచాలు, జీడిపప్పు, బాదం పప్పు పొడి - 5 చెంచాలు, నెయ్యి - 1/4 కప్పు, కిస్‌మిస్‌లు - 24, సోడా - 1 చెంచా, పాలు - 1 కప్పు
ముందుగా పిండిలో అన్నీ కలిపి పాలు పోసి సోడా చేర్చి కొంచెం నీరు చేర్చుతూ దోశెల పిండిలా కలపాలి. ఇవి గుంటల్లో పోసి గుంట పొంగడాలుగాను, దోశెలుగాను చేసుకోవాలి.

-వాణి ప్రభాకరి