రుచి

నవరాత్రి నైవేద్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశరన్నవరాత్రి ఉత్సవాల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో అమ్మను పూజిస్తే తప్పక పలుకుతుంది. భక్తికి తలవంచే ఆ జగన్మాత నవరూపాలలో దర్శనమిస్తుంది కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎవరికి తోచిన విధంగా వారు నైవేద్యాలు సమర్పిస్తారు. అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు గురించి తెలుసుకుందాం.

స్వీట్ పొటాటో కట్‌లెట్స్

కావల్సినవి : ఉడకబెట్టిన రెండు కప్పుల స్వీట్ పొటాటో ముక్కలు, పావు కప్పు పనీర్ పొడి, పావు కప్పు వేరుశనగ పప్పు పొడి, చెంచాఅమ్చ్యూర్ పౌడర్, చెంచా మిర్చి పౌడర్, తగినంత ఉప్పు, గోధుమ పిండి, చెంచా కొత్తిమీర తరుగు, తగినంత నెయ్యి. తయారుచేసే విధానం: పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలిపి చపాతీ పిండి వలే చేసుకోవాలి. వాటిని కట్‌లెట్స్ వలే తయారుచేసుకుని వేయించుకోవాలి. మనకు నచ్చిన చట్నీతో వాటిని నైవేద్యంగా పెట్టుకోవచ్చు.

మఖానా కీ ఖీర్

కావల్సినవి: ఒక లీటరు పాలు, అరకప్పు మఖానా, చెంచా నెయ్యి, పావు కప్పు పంచదార, చెంచా బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. టీ స్పూన్ యాలకుల పొడి.
తయారుచేసే విధానం: పాన్‌లో నెయ్యి వేసి మఖానాను వేయించండి. అవి పెళుసుగా అయ్యేవరకు వేయించండి. తరువాత వాటిని దించి చల్లారిన తరువాత మిక్సీలో పౌడర్‌గా చేసుకోండి. వేరే పాన్ తీసుకుని అందులో లీటరు పాలు పదిహేను నిమిషాల పాటు కాచిన తరువాత పంచదార, యాలకుల పొడి కలపండి. ఇపుడు పావు కప్పు మఖానా పౌడర్ కలపండి. చిక్కదనం వచ్చేలా చూసుకోండి. పిస్తా, జీడిపప్పు పలుకులు కలిపి ఐదు నిమిషాలు వేడిమీద ఉంచి దించేస్తే మఖానా కీ ఖీర్ రెడీ. వేడి వేడిగా సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు.

డోక్లా

కావల్సినవి : కప్పు బాగర్, కప్పు పెరుగు, రెండు చెంచాల సగ్గుబియ్యం, చెంచా వంటసోడ, చెంచా అల్లం ముక్కలు, చెంచా పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, చెంచా జీలకర్ర, చెంచా పల్లీలు, ఇంగువ, చెంచా కారం, నాలుగు చెంచాల నూనె, తగినంత ఉప్పు.
తయారుచేసే విధానం: బాగర్, సగ్గుబియ్యంను పౌడర్‌గా మిక్సీ పట్టాలి. ఏదైనా పాత్ర తీసుకుని అందులో ఈ పొడి, పెరుగు కలపండి. అవసరమైన మేరకు నీళ్లు కలిపి ఇడ్లీ పిండి వలే తయారుచేసుకోవాలి. పిండిని రెండు భాగాలుగా చేసుకుని ఉప్పు, బేకింగ్ పౌడర్ కలపండి. ఇడ్లీ డిష్‌లో పది నిమిషాలు ఉడికించండి. మిగిలిన సగం పిండిలో పచ్చి మిరపకాయ ముక్కలు, అల్లం, కొత్తిమీర, పల్లీ పౌడర్, అర స్పూన్ సోడ, ఇంగువ, ఉప్పు కలపండి. డోక్లా ట్రే తీసుకుని పిండిని పోసి పది నిమిషాలు పాటు ఉడికించాలి. ఓ పాన్‌లో నూనె వేసి అందులో జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోండి. ఉడికిన డోక్లాను వేయండి. వేడి వేడి డోక్లాను చట్నీతో సర్వ్ చేయండి.

చుడువా

కావల్సినవి : వందగ్రాములు సగ్గుబియ్యం చిప్స్, 50 గ్రాములు పొటాటో స్టిక్స్, వంద గ్రాములు నైలాన్ సగ్గుబియ్యం, 50 గ్రాములు పల్లీలు, కరివేపాకు, కట్ట కొత్తిమీర, కట్ట పుదీనా, ఐదు లేదా ఎనిమిది పచ్చి మిరపకాయలు, చెంచా మిరియాల పౌడర్, అర చెంచా సిట్రిక్ యాసిడ్ పౌడర్, చెంచా పంచదార, రుచి కోసం ఉప్ప, మూడు చెంచాల నూనె.
తయారుచేసే విధానం: పాన్‌లో నూనె వేడి చేసుకోవాలి. సగ్గుబియ్యం చిప్స్, నైలాన్ సగ్గుబియ్య, పొటాటో స్టిక్స్, పల్లీలు, పుదీనా, పచ్చి మిరిపకాయలు, కరివేపాకు వేసి వేయించి పెట్టుకోవాలి. కొత్తిమీర కలపండి. మరొక పాత్ర తీసుకుని అందులో పైన వేయించి పెట్టుకున్నవాటిని వేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి, సిట్రిక్ యాసిడ్ పౌడర్, పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.