రుచి

పంచదార బొమ్మా ..బొమ్మా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతల్లో, తిరునాళ్లల్లో పంచదార బొమ్మలు తెల్లగా, ఎర్రగా మనకి దర్శనమిస్తాయి. ఆదరణ తగ్గిన వీటిల్లో ఎక్కువగా కోడి బొమ్మలే వుంటాయి. అయితే ఇప్పుడు చక్కెర బొమ్మల్లో కూడా సృజనాత్మకత సంతరించుకుంది. మామూలుగా అయితే స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, పెళ్ళిళ్ళల్లోనూ భోజనాల దగ్గర ఓ టేబుల్‌మీద ఫలాలతోనూ, వివిధ రకాల ఆహార పదార్థాలతో బొమ్మలను (వెజ్ కార్వింగ్) ప్రత్యేక అలంకరణగా పెడుతున్నారు. ఇప్పుడు పంచదారనీ, కార్వింగ్ ప్రక్రియని కాస్త మిక్స్ చేసి చక్కనైన గాజుబొమ్మని టేబుల్‌మీద ఉంచినట్లు కనిపించే కళారూపాలని కళ్ళముందుంచుతున్నారు ఈనాటి షెఫ్‌లు. అందంకోసం ఇంట్లో ఉండే గాజుబొమ్మల్లానే ఆహారం కనువిందుగా ఉంచేందుకు పదార్థాలమీద, కేక్స్‌మీద అలంకరించే స్పెషల్ అలంకరణే ఈ ‘షుగర్ షో పీసెస్’.
పంచదారని ప్రత్యేకంగా వేడి చేసి చల్లార్చి ముద్దగా చేసి వైవిధ్యభరితమైన ఆకృతుల్ని తయారుచేయడం ఇప్పటి ట్రెండ్. పంచదారకు నీరు చేర్చి వేడి చేసి సిలికాన్ రబ్బర్ మ్యాట్‌మీద పోయాలి. మనకు నచ్చిన రంగుని కలపాలి. ఈ పాకాన్ని కాస్త చల్లార్చి ముద్దలా చేసి సాగదీసి మళ్లీ మళ్లీ ముద్దలా చేయడంవల్ల గాజులాంటి పదార్థం తయారవుతుంది. దీన్ని ‘్ఫల్డ్ షుగర్’ అని వ్యవహరిస్తారు. అంటే ఒక రకమైన ‘క్లే’లా మనం ఎలా కావాలంటే అలా వౌల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే వేడిగా ఉన్నప్పుడే బొమ్మను చేసెయ్యాలి. పక్షులూ, జంతువులూ, జలపాతాలు, పండ్లూ ఇలా అన్ని తరహా బొమ్మలు ఈ పంచదార ముద్దతో ముద్దుగా తీర్చిదిద్దబడుతున్నాయి. అంగుళం నుంచి ఆరడుగుల వరకూ ఈ కళాకృతులు తళుక్కుమంటున్నాయి. విదేశాల్లో వీటిని ‘ఐ క్యాండీ’ (నేత్రాలకూ చాక్లెట్స్ అన్నమాట)గా వ్యవహరిస్తున్నారు. వీటిని ఎండా తేమా తగలకుండా ఉంచితే నెలల తరబడి చూడచక్కని డిజైన్స్‌తో అలరారుతుంటాయి.

-తరిగొప్పుల విఎల్లెన్‌మూర్తి