రుచి

అమ్మవారికి అన్న నైవేద్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిషాసురమర్దినికి కొబ్బరన్నం

కావల్సినవి: అన్నం - రెండు కప్పులు (నీళ్లు ఒకటికి ఒకటిన్నర తీసుకోవాలి.) పచ్చి కొబ్బరి ముక్కలు - కప్పు, పచ్చిమిర్చి - నాలుగు, అల్లం ముక్క - చిన్నది, నిమ్మకాయ - ఒకటి, ఉప్పు - తగినంత, తాళింపు దినుసులు - మినపప్పు, జీలకర్ర, జీడి పప్పు - పావు కప్పు, నెయ్యి - ఐదు చెంచాలు.

ఇలా తయారుచేయాలి : కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం - ఈ మూడింటిని కలిపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. బాణిలో నెయ్యి కరిగించి మినపప్పు, జీడి పప్పు, జీలకర్ర వేయించి కొబ్బరి చేర్చాలి. ఆ తరువాత నిమ్మరసం పిండాలి. చివరిగా అన్నంలో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేస్తే సరిపోతుంది. కరివేపాకు కూడా వేసుకోవచ్చు.

రాజ రాజేశ్వరిదేవికి పేలాల ఉండలు:

కావల్సినవి : పేలాలు - రెండు కప్పులు, నువ్వులు, వేరు శనగ పప్పు, ఎండు కొబ్బరి - అర కప్పు చొప్పున, నెయ్యి - కప్పు, బెల్లం తురుము - రెండు కప్పులు, యాలకుల పొడి - చిటికెడు.

ఇలా తయారుచేసుకోవాలి : పైన పేర్కొన్న పదార్థాలన్నింటినీ రెండు చెంచాలు నెయ్యి వేస్తూ విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. చల్లారాక బెల్లం తప్ప అన్నింటినీ మిక్సీలో వేయాలి. చివరిగా బెల్లం కూడా మిక్సీలో వేసి ఒకసారి తిప్పాలి. ఈ మిశ్రమాన్ని గినె్నలోకి తీసుకుని కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసి ఉండ చుట్టుకుని చూడాలి. లేదంటే మరికాస్త నెయ్యి వేసుకుని ఉండలు చుట్టుకోవచ్చు. నైవేద్యం పూర్తయ్యాక నేతిలో వేయించిన జీడి పప్పు, బాదం పలుకులతో అలంకరించుకోవచ్చు.