రుచి

ఆరోగ్యానికి గోధుమ రవ్వ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరుకులు పరుగుల జీవనంలో ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. మనం తినే ఆహారంలో అన్నిరకాల పోషకవిలువలు ఉండవు. గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే పోషకాహారం తీసుకున్నట్లే. గోధుమ రవ్వలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. ఈ ఆహారాన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉంటుంది. రవ్వ ఉప్మా తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా జింక్ ఫుడ్ తినాలనే ఆసక్తి ఉండదు. ఉదయానే్న గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు అల్పాహారంగా తీసుకుంటే రోజుంతా అక్టివ్‌గా ఉండవచ్చు. ఇందులో అవసరమైన న్యూట్రిషన్లు లభిస్తాయి. షుగర్ ఉన్నవారికి ఇది సరైన ఆహరం. దీంట్లోని తక్కువ గ్లెసేమిక్ ఇండెక్స్, కాంప్లెక్స్ కార్బ్స్ శరీరంలోని గ్లూకోస్‌ను నియంత్రించి క్రమబద్దీకరిస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రించటం సులువు అవుతుంది. శరీర సామర్థ్యం పెరిగి మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. మలబద్దకాన్ని కూడా నిర్మూలించడంలో ఎంతోగానో దోహదం చేస్తుంది.