రుచి

కందతో కమ్మగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో కంద చౌకగా దొరుకుతుంది. దీంతో రకరకాల కమ్మటి కూరలు వండుకోచవ్చు. తియ్యని కూర, నిమ్మరసం కూర, కంద బచ్చలి పులుసు, చింతరసం కూర చేస్తారు.
*
మిక్సర్
కంద - 1/2 కేజీ
జీడిపప్పులు - 12
వేరుశెనగ పప్పులు - 1/2 కప్పు
కరివేప - 5 రెమ్మలు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
కారం, ఉప్పు - 2 చెంచాలు
పసుపు - 50 గ్రా.
నూనె - 250 గ్రా.
విధానం: కంద తొక్క తీసి కడిగి ఆరనిచ్చి ముక్కల్ని మిక్సి పట్టాలి. మెత్తగా కాకుండా చూసుకోవాలి. దీనికి పసుపు, ఉప్పు కలిపి ఎండలో పెట్టాలి. రెండు గంటల తరువాత పొడిలా వస్తుంది. దీన్ని నూనెలో వేయించాలి. మిక్సర్‌గా వస్తుంది. ఇది రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది.
*
వడ

కంద ముక్కలు - 1/2 కేజీ
శెనగపప్పు - 1 కప్పు
నూనె - 250 గ్రా.
మిర్చి - 8
జీలకఱ్ఱ - 1 చెంచా
ఉప్పు - 2 చెంచాలు
అల్లం
కరివేప - కొంచెం
విధానం:కంద ముక్కలు మిక్సి పట్టాలి. శెనగపప్పు మిక్సీ పట్టాలి. రెండూ కలిపి మిక్సీ పట్టి ఉప్పు, కరివేప, జీలకఱ్ఱ, చేర్చి కలిపి వడలుగా తట్టి నూనెలో వేయించాలి. ఇదే అట్టు అయితే పెసలతో రుబ్బి కంద అట్టు చేసుకోవాలి.
*
అప్పాలు

తియ్యకంద - 1/2 కేజీ
బెల్లం - 250 గ్రా.
మైదాపిండి - 1 కప్పు
నూనె - 250 గ్రా.
ఉప్పు - చిటికెడు
ఏలకులు - 5
కొబ్బరి కోరు - 1/2 కప్పు
విధానం: కంద ఉడికించి ఊరబెట్టి, బెల్లం, కొబ్బరి, ఏలకులు చేర్చి ముద్దగా చేసుకోవాలి. బిళ్ళలుగా చేసుకొని మైదాకి అద్ది నూనెలో వేయించి తియ్యాలి.
*
కచోరీలు

శెనగపప్పు - 1 కప్పు
కంద గుజ్జు - 1 కప్పు
బెల్లం - 1 కప్పు
నూనె - 250 గ్రా.
శెనగపిండి - 1/2 కప్పు
మైదా - 1/2 కప్పు
ఉప్పు - చిటికెడు
ముందుగా శెనగపప్పు, కంద గుజ్జు ఉడికించి బెల్లం కలిపి ఉండలుగా చేసుకోవాలి. తీపి బూరెల పిండి మాదిరిగా కలిపి దీన్ని బిళ్లల్లో అద్ది ఇందులో ముంచి నూనెలో వేయించి తియ్యాలి.
*
శనగపప్పుతో పులుసు

శెనగపప్పు - 1/2 కప్పు
కంద ఉడికించిన ముక్కలు - 1 కప్పు
కొబ్బరికోరు - 1 కప్పు
చింతపండు పులుసు - 4 కప్పులు
ఇంగువ - కొంచెం
ఎండుమిర్చి, పోపులు, ఉప్పు - కొద్దిగా
విధానం: పై పదార్థాలు మెత్తగా ఉడికాక, చింతపండు రసం, పోపులు వేసి మరిగించి దించాలి.

-వాణి నారుమంచి