రుచి

కట్ చేద్దాం కేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేకులు పిల్లలనే కాదు పెద్దలనూ రుచితో ఊరిస్తూ ముద్దుగా ఆహ్వానించినా బొద్దుగా తయారవుతామన్న బెంగతో కొందరు, సరైన కొలతలు తెలియక సరిగా రాదేమోనన్న భయంతో మరికొందరు, కేక్ చేయాలంటే ఓవెన్ కావాలి కదా అన్న సందేహంతో ఇంకొందరు దాని జోలికి వెళ్లాలనుకోరు. ఈ ఇబ్బందులన్నీ దూరం చేస్తూ కేక్స్ బేక్ చేసేద్దాం.
*
రవ్వ కేక్
కావల్సినవి: ఒకటిన్నర కప్పు బొంబాయిరవ్వ, అర కప్పు మైదా, ఒక కప్పు పంచదార, చిన్న దాల్చిన చెక్క ముక్క, రెండు ఏలకులు, అరకప్పు రిఫైండ్ ఆయిల్, అర చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా బేకింగ్ పౌడర్, ఐదారు చుక్కలు వెనిలా ఎసెన్స్, అరకప్పు కాచి చల్లార్చిన పాలు, కేక్ టిన్ సిద్ధం చేసుకోవాలి.
తయారీ విధానం: మైదా, గుడ్డూ, వెన్న, ఓవెన్ లేకుండా చేసే రవ్వ కేక్ అందరికీ నచ్చుతుంది. ముందుగా కుక్కర్‌కి ఉన్న వెయిట్, ఇంకా గాస్‌కట్ తీసివేసి అడుగున ఇసుక గానీ, ఒక కప్పు సాల్ట్ కానీ పోసి మూతపెట్టి స్టవ్‌పైన ప్రీహీట్ కోసం పెట్టుకుని కేక్ మిశ్రమం తయారుచేసుకోవాలి. కేక్ టిన్‌లో కొన్ని చుక్కలు నూనె పూసి మైదాతో డస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పంచదార, ఏలకులు, దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, రవ్వ, రిఫైండ్ ఆయిల్ వేసి ఇడ్లీ పిండిలా ఒకసారి మిక్సీ వేసుకోవాలి. మిశ్రమం వచ్చేవరకూ సరిచూసుకుని కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని అలాగే కానీ లేదా ఇష్టమైన జీడిపప్పు పలుకులు, టూటీ ఫ్రూటీ కూడా కలుపుకొని కేక్ టిన్‌లో పోసి గాలిబుడగలు లేకుండా రెండుసార్లు ట్యాప్ చేసి కుక్కర్‌లో పెట్టి మూత వేసి పది నిమిషాలు హై ఫ్లేమ్‌లో వుంచి మరో ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్‌పై బేక్ చేసి మూత తీసి చాకుతో గ్రుచ్చి చూడాలి. అంటుకోకుండా వుందంటే రవ్వకేక్ సిద్ధమైనట్టే. కేక్ టిన్‌ని ఫేన్ క్రింద ఆరబెట్టి నెమ్మదిగా ప్లేట్ మూసి తిరగేయాలి. చక్కటి రుచికరమైన రవ్వ కేక్ తయారైనట్లే.
చాక్లెట్ కేక్
కావల్సినవి : రెండున్నర కప్పుల మైదా, అర చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకున్న మిశ్రమం. ఒక కప్పు పంచదార, కోకో పౌడర్ మూడు స్పూన్లు, రిఫైండ్ ఆయిల్ అర కప్పు, పావు చెంచా నిమ్మరసం, వెనిల్లా ఎసెన్స్ పావు చెంచా తీసుకోవాలి.
తయారీ విధానం: ఇసుక లేదా సాల్ట్‌పోసిన కుక్కర్‌ని పది నిమిషాలు ముందుగా ప్రీ హీట్‌కి పెట్టి, కేక్‌టిన్‌ని గ్రీజ్‌చేసి మైదా జల్లి డస్ట్ చేసి పెట్టుకున్నాక, మిక్సీ జార్లో పంచదార వేసి మెత్తటి పౌడర్లా చేసుకున్నాక అందులో మైదా మిశ్రమం, వెనిల్లా ఎసెన్స్, నిమ్మరసం, కోకోపౌడర్, ఆయిల్ వేసి నెమ్మదిగా ఆపి ఆపి మిక్సీ తిప్పాలి. ఇడ్లీ పిండి వలే చేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుకుని కేక్ టిన్‌లో పోసి కుక్కర్‌లో పెట్టి మొదటి పది నిమిషాలు హై ఫ్లేమ్‌లో, తరువాత ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో బేక్ చేసుకోవాలి. చాకుతో చెక్ చేసుకుని దింపి, చల్లారాక ప్లేట్‌లో బోర్లించుకుంటే హాట్ హాట్‌గా కానీ, ఆరనిచ్చాకైతే చల్లగా కానీ, యమీగా వుండే చాక్లెట్ కేక్ రెడీ. దాన్ని చాకో స్టిక్స్‌తో, జెంస్‌తో, వేపర్ బిస్కెట్స్‌తో మనకు ఇష్టమైన విధంగా అలంకరించుకొంటే ఇంట్లోనే తయారుచేసుకున్న చాక్లెట్ కేక్‌తో పిల్లలు కూడా చక్కగా బర్త్‌డే జరుపుకని తృప్తిగా రుచిని ఆస్వాదిస్తారు.
స్పాంజ్ కేక్
పైన చెప్పిన చాక్లెట్ కేక్‌లో వేసి కోకో పౌడర్ వేయకుండా మిగతా అంతా అదేవిధంగా తయారుచేసుకుంటే స్పాంజ్ కేక్ రెడీ. బయట కొనే పనిలేకుండా స్వయంగా చేసుకున్న కేక్‌ని మీ స్వహస్తాలతో కట్ చేసుకుని తిని ఆనందిస్తారు కదూ!ప్రతిరోజూ కాదుగా, వేడుక సందర్భాల్ని తియ్యగా, వేడుగ్గా జరుపుకుందాం మరి!

-డేగల అనితాసూరి