రుచి

మొలకెత్తిన శనగలు మేలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోజనానికి ముందు మొలకెత్తిన శనగలు తీసుకుంటే మధుమేహం వచ్చే ముప్పు తగ్గుతుంది. భోజనానికి ముందు 50 గ్రాములు మొలకెత్తిన శనగలు తీసుకుంటే ఆహారం ద్వారా శరీరానికి అందే కార్బోహైడ్రేట్లు వేగంగా అరగకుండా నియంత్రించబడతాయి. దీంతో రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అలాగే మెంతికూర డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మంచి చేస్తుంది. షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. స్కిన్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. వారానికి రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే మంచిది. ఆహారాన్ని తినటం మానేయటం మంచిది కాదు. ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. వేపుడు కూరలు తినటం కూడా మంచిదికాదు. అన్నం, ఆలుగడ్డ, అరటి వంటివి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతాయి. ఇలాంటివి పెద్ద మొత్తంలో తినకుండా చూసుకోవాలి. రక్తపోటు రాకుండా ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం అన్ని విధాల మంచిది. రోజూ ఎప్పుడైనా సరే.. ఆహారాన్ని ఒకేసారి పెద్దమొత్తంలో తినకుండా జాగ్రత్త పడాలి.