రుచి

రోజ్ ఫలూడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
పాలు, సబ్జా గింజలు, రోజ్ సిరప్: మూడు టేబుల్ స్పూన్స్, సేమియా: ఫావు కప్పు, ఐస్‌క్రీమ్: రెండు కప్పులు, తరిగిన డ్రైఫ్రూట్స్, రోజ్ జెల్లీ కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా సబ్జా గింజలను నానబెట్టుకోవాలి. ఈలోగా పాలను కాచి చల్లార్చుకోవాలి. చల్లార్చిన పాలలో రోజ్ సిరప్‌ను కలపాలి. సేమియాను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. సబ్జా గింజలు పదిహేను నిముషాల పాటు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఓ పొడవాటి గ్లాస్ తీసుకుని అందులో నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను వేయాలి. వాటిపైన ఉడకబెట్టి ఉంచుకున్న సేమియాను వేయాలి. వీటిపై రోజ్ సిరప్ కలిపిన పాలను వేయాలి. వీటన్నిటి పైన ఐస్‌క్రీమ్‌ను వేయాలి. గ్లాసు బయట నుంచి చూస్తే ఇవన్నీ పొరలుపొరలుగా కనిపిస్తాయి. చివరగా ఐస్‌క్రీమ్‌పైన తరిగిన డ్రై ఫ్రూట్స్, రోజ్ జెల్లీ వేస్తే చల్లచల్లని రోజ్ ఫలూడా తయారైనట్లే. ఈ రోజ్ జెల్లీ అనేది ఆప్షనల్. వేస్తే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. వేసవికాలంలో ఈ రోజ్ ఫలూడా దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. *