రుచి

చెరకు రసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు:
చెరకు ముక్కలు, పంచదార, అల్లం, నిమ్మరసం, ఐస్‌క్యూబ్స్
తయారీ విధానం:
చెరకు రసం చేయడం అందరికీ తెలుసు. కానీ చాలామంది దాన్ని ఇంట్లో చేసుకోకుండా బయట తాగుతుంటారు. కొంతమందికి బయట జ్యూసులు తాగడం ఇష్టముండదు. చెరకు రసం ఎంత ఇష్టమున్నా తాగలేరు. అలాంటివారి కోసం ఈ చెరకురసం. ముందుగా చెరకును తీసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అంటే ఎండు కొబ్బరిని మనం కట్ చేస్తాం కదా.. అంతకంటే కొద్దిగా పెద్దముక్కలన్నమాట. ఐస్‌క్యూబ్స్‌ని క్రష్ చేసే బ్లేడులు కూడా వస్తున్నాయి కొన్ని మిక్సీలలో. అలాంటి మిక్సీ జార్‌ను తీసుకుని కట్ చేసి పెట్టుకున్న చెరకు ముక్కలు, పంచదార, అల్లం ముక్కలు వేసి బాగా మిక్సీ పట్టాలి. తరువాత దీనిని వడకట్టుకుని ఇందులో నిమ్మరసం, ఐస్‌క్యూబ్‌లు వేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే సరి. ఎన్నో ఆరోగ్యలాభాలను చేకూర్చే చెరకురసం సిద్ధం.