రుచి

కాకరకాయ పకోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావల్సినవి: శనగపిండి 200గ్రా, కాకరకాయలు సన్నగా తరిగిన ముక్కలు- 3కప్పులు, కొత్తిమీర తరుగు పావుకప్పు, పచ్చిమిర్చి (తరిగినవి) 4, ఉప్ప తగినంత, నూనె అరకిలో, కొంచెం తినే సోడా, 3 స్పూనుల బియ్యంపిండి.
చేసేవిధానము: శనగపిండిని బాగా జల్లించుకొని దానిలో ఉప్పు, పచ్చిమిర్చి తినే సోడా బియ్యంపిండి కొత్తిమీర వేసి కలపాలి. ముందుగా కాకరముక్కలను ఉప్పువేసి ఒక పొంగు రానిచ్చేదాకా వేడి చేయాలి. ఆ తరువాత వాటిని చిల్లుల గినె్నలో వేసి నీటిని పిండికాకరను వేరుచేయాలి. ఇలా పిండిన కాకర ముక్కలను పిండిలో కలిపిన తర్వాత కాసిని నీరు కలుపుతూ పిండిని గట్టిగా పకోడి పిండిలాగా చేసుకోవాలి. పిండిలో తక్కువ నీరు పోసుకొంటే పకోడి గరగర అంటే క్రిస్పిగా వస్తుంది. నూనె బాగా కాగనిచ్చి పకోడీలు వేయాలి. ఇవి బంగారు రంగు వచ్చేదాక వేపి నూనెనుంచి బయటకు తీసి వీటి మీద కొత్తిమీర తరుగును అలంకరిస్తే వహ్వా కాకర పకోడి అంటారు.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003