రుచి

పనస భలే పసందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి గరగర.. తల్లి పీచు పిల్లలేమో రత్న మాణిక్యాలు అని పొడుపుకథల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ పండు పనసపండు ఆ పిల్లలు అంటే తొనలు ఇల్లంతా మంచి సువానసను వెదజల్లుతుంటాయ. ఆ తొనలన్నీ తినేసి అందులో ఉండే గింజలతో కూడా మంచి మంచి పసందైన విందులు చేసుకోవచ్చు. ఇపుడు వాటిని చూద్దాం..
పనసగింజల ఫ్రై
పనస గింజలు - 2 కప్పులు
ఉల్లి ముక్కలు - 1 కప్పు
జీలకఱ్ఱ , కారం - 2 చెంచాలు
కరివేపాకు - కొంచెం
పుట్నాలపొడి - 1/2 కప్పు
ఉప్పు -2 చెంచాలు
నూనె - 1/2 కప్పు
జీడిపప్పులు - 24
విధానం: ముందుగా గింజలు పైతొక్క తరిగి పచ్చిగింజల్ని ముక్కలుగా తరగాలి. నూనె కాగనిచ్చి ఈ ముక్కలు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే నూనె మూకుడులో జీలకఱ్ఱ, కరివేపాకు వేయించి నఉల్లిముక్కలు వేయించిన పనసగింజలు ముక్కలు కలిపి కాసేపు మూతపెట్టి ఉంచాలి. ఐదు నిముషాల తరువాత పుట్నాలపొడి జల్లి దించుకోవాలి.
వడలు
పనసగింజలు - 2 కప్పులు
బంగాళాదుంపలు - 2
అల్లం - చిన్న ముక్క
మిర్చి - 5, జీలకఱ్ఱ - 1 చెంచా
శనగపిండి - 1/2 కప్పు
నూనె - 250 గ్రా.
కార్న్‌ఫ్లోర్ - 1/2 కప్పు
బియ్యం పిండి - 1/2 కప్పు
ఉప్పు - 1 చెంచా
విధానం: ముందుగా పనస గింజలు నీటిలో నానబెట్టి పొర వలచి మిక్సీ పట్టాలి. ఇది కోరు ముదిరి వస్తుంది. దీనిలో బంగాళా దుంప ఉడికించిన ముద్ద, అల్లం, మిర్చి, జీలకఱ్ఱ శనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఇపుడు కార్న్‌ఫ్లోర్ బజ్జీల పిండిలాగాకలుపుకోవాలి. ఇపుడు ఇందులో నూనె కాగాక పై పిండి వడలుగా చేసుకుని కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ జారుడు పిండిలో ముంచి నూనెలో వదలాలి. ఈ తరహా అన్నీ వడలు చేసుకోవాలి.
చిక్కుడు కాయలతో..
టమోటా సాస్ - 2 చెంచాలు
జీడిపప్పు పేస్ట్ - 5 చెంచాలు
తరిగిన చిక్కుడు కాయ ముక్కలు- 2 కప్పులు
పనసగింజలు తరిగిన ముక్కలు -2 కప్పులు
మసాలా కారం - 4 చెంచాలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు
నూనె - 1/4కప్పు
ఉప్పు - 1 చెంచా
శనగపప్పు - 2 చెంచాలు
కొబ్బరి కోరు - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 6
మీగడ - 1 కప్పు
విధానం: ముందుగాముందుగా చిక్కుడు, పనస ముక్కలను ఉడికించుకుని పెట్టుకోవాలి. ఆ తరువాత బాణలిలో నూనె వేగాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోపు పెట్టి ఉడికించి పెట్టుకున్న చిక్కుడు, పనసగింజలను చేర్చాలి. ఆ కొద్దిసేపు సన్నని సెగ మీద ఉంచాలి. ఆ తరువాత దీనికి కొబ్బరిచేర్చుకోవాలి. ఇందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపి కలపాలి. ఇది మెత్తబడ్డాక మీగడ వేసి బాగా కలపాలి. కమ్మని వాసన వస్తుండగా టమోటా సాస్, జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి దింపాలి. ఇది అన్నంలోకైనా చపాతి, దోశె దేనికైనా రుచిగా ఉంటుంది.

-లక్ష్మీ ప్రియాంక