రుచి

బీరకాయ మసాలా కూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్థాలు: బీరకాయలు : 4, నూనె : పోపుకు సరిపడ, ఉప్పు: తగినంత , పసుపు : చిటికెడు, మినపప్పు: 1 స్పూన్, శనగపప్పు: 1 స్పూన్, ఆవాలు :1 స్పూన్, దాల్చిన చెక్క : చిన్న ముక్క, లవంగాలు: 3, జీలకర్ర : 1 టేబుల్ స్పూన్, ధనియాలు : 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి : 4 పాయలు, ఉల్లిపాయలు: 2 పెద్దవి, పచ్చిమిరపకాయలు: 2
తయారు చేసేవిధానం: ముందుగా మసాలా దినుసులు అన్నీ కలిపి వెల్లుల్లి, ఉల్లిపాయ రెండూ వేసి మిక్సీ పట్టాలి. మెత్తగా అయిన పేస్టును తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత బీరకాయ పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనె వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి అవి చిటపట లాడాక తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేయాలి. ఉప్పు, పసుపు చేర్చి మూత పెట్టాలి . కాస్త మగ్గిన తరువాత తయారు చేసి పెట్టుకున్న మసాల పేస్టును బీరకాయ ముక్కలకు చేర్చాలి. సన్నని మంటపైన కూరను బాగా మగ్గనివ్వాలి. కొద్దిసేపటికి మంచి సువాసనతో కూర తయారు అవుతుంది. దీనిని బాణలి నుంచి వేరు చేసుకొని అన్నం లోకి కాని, రోటీల్లోకి కాని తింటే చాలా బాగుంటుంది.