రుచి

పెసర పంకీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలసిన పదార్ధాలు:

మొలకెత్తిన పెసర్లు - 2 కప్పులు,
బొంబాయి రవ్వ- 2 స్పూన్స్,
కొత్తిమీర తరుగు - 2 సూన్స్,
శనగపిండి - 2 స్పూన్స్ ,
నూనె - 3 టేబుల్ స్పూన్స్,
ఓట్స్ - 2 స్పూన్స్,
సన్నగా తరిగిన పచ్చి మిరప - 1 స్పూన్,
ఉప్పు తగినంత ,
ఆరు అంగుళాల పొడవు, వెడల్పు ఉన్న అరటాకులు : కావల్సినన్ని

తయారీ విధానం: ముందుగా మొలకెత్తిన పెసర్లను మిక్సీలో నీళ్లు లేకుండా రుబ్బుకోవాలి. విడిగా తీసి ఆ పెసర మిశ్రమానికి బొంబాయి రవ, శనగపిండి, కొత్తిమీర, ఉప్పు ఓట్స్ అన్నీ కలపాలి. కాసిని నీళ్లు చిలకరించుకుని మెత్తగా ముద్దగావచ్చేట్టుగా చేసుకోవాలి.
ఇపుడు కత్తిరించి పెట్టుకొన్న అరటాకు మీద ఈ పిండి ముద్దను నిమ్మకాయ సైజులో చేసుకొని ఆకు పైన పెట్టి రెండవ ఆకుతో రౌండ్‌గా వత్తాలి. వీటిని మెల్లగా పాన్‌లో ఆకుతో సహా వేసి సన్నని సెగమీద ఒక చంచా నూనె వేసి కాల్చుకోవాలి. ఆకులు కమలిపోయి పెసర పంకీమంచి వాసన వస్తుంది. అపుడు పాన్ నుంచి వేరుచేసుకోవాలి. మెల్లగా ఆకును విడదీసి పంకీలను ప్లేటులో కొత్తిమేరతో అలంకరిస్తే తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. అరటాకులు లేనివారు ఉత్త పిండినే పాన్ మీద వేసుకొని చుట్టూర నూనె వేసుకొని రెండు వేపులా కాల్చుకోవచ్చు