రుచి

పర్వదినాన పసందుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెడుపై మంచి సాధించిన గుర్తుగా
దసరాను జరుపుకుంటారు భారతీయులందరూ.. అమ్మవారిని తమ శక్తికి తగినట్లుగా పూజించి, ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో పిండి వంటలను.. ముఖ్యంగా తీపిని చేసుకుని తింటారు. స్వీట్లు అనగానే మనకు గుర్తొచ్చేది బెంగాల్. బెంగాల్‌వారు దసరాకు తప్పనిసరిగా చేసుకునే కొన్ని వంటకాల గురించి...
*
షాహీ తుక్డా

కావలసిన పదార్థాలు
నూనె: రెండు చెంచాలు
బ్రెడ్: రెండు స్లైసులు
పాలు: ఒక గ్లాసు
పంచదార: రెండు చెంచాలు
కుంకుమపువ్వు: చిటికెడు
ఎండు ఫలాలు: తగినన్ని
జీడిపప్పు: తగినన్ని
తయారీ విధానం
స్టవ్‌పైన పాన్ ఉంచి బ్రెడ్‌ను ఒక స్పూన్ నూనె కానీ, నెయ్యి కానీ వేసి వేడి చేసుకోవాలి. అడుగు మందమున్న మరో పాన్‌ను తీసుకుని అందులో పాలు, పంచదార, కుంకుమపువ్వు వేసి బాగా మరగనివ్వాలి. ఇందులోనే అన్ని రకాల డ్రైఫ్రూట్స్ వేసి ఈ మిశ్రమం బాగా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకుని అందులో టోస్ట్ చేసిన బ్రెడ్‌ను తీసుకుని దానిపై మరిగించిన పాల మిశ్రమాన్ని వేసుకుని వేడివేడిగా తినాలి. అంతే ఎంతో రుచికరమైన షాహీ టుక్డా రెడీ.
*
కోకొనట్ రోల్స్
కావలసిన పదార్థాలు
కోవా: ఒక కిలో
పంచదార: 300 గ్రాములు
కుంకుమపువ్వు: ఒక గ్రాము
కొబ్బెర పొడి: 100 గ్రాములు
తయారీ విధానం
అడుగు మందంగా ఉన్న పాన్‌ను స్టవ్‌పై ఉంచాలి. ఇందులో కోవా, పంచదార వేసి వేడిచేయాలి. ఈ సమయంలో స్టవ్‌ను సిమ్‌లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. పంచదార కరగడానికి కనీసం ఇరవై నిముషాలు పడుతుంది. ఇదంతా దగ్గరిగా అయ్యాక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. తరువాత దీన్ని రెండు భాగాలుగా విభజించాలి. ఒక భాగాన్ని చపాతీలా పరిచి రోల్‌లా చుట్టుకోవాలి. మరో భాగంలో కొద్దిగా కుంకుమపువ్వును వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మృదువుగా తయారవుతుంది. దీన్ని కూడా చపాతీలాగా పరిచి, దీనిపై ముందుగా తయారుచేసుకున్న రోల్‌ను ఉంచి.. దీన్ని కూడా రోల్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఓ రోల్‌లా కనిపిస్తుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిపై కొబ్బరిపొడి చల్లి వడ్డించాలి. అంతే ఎంతో రుచికరమైన కోకొనట్ రోల్స్ తయారీ.
*
కేసర్ రసగుల్లా
కావలసిన పదార్థాలు
పాలు: ఒకటిన్నర లీటర్
నిమ్మరసం: రెండు చెంచాలు
బొంబాయి రవ్వ: చెంచా
నారింజ రంగు: చిటికెడు
యాలకులపొడి:
పావు చెంచా
పిస్తా: పది
జీడిపప్పు: పది
బాదాం: పది
పంచదార: ఒకటిన్నర కప్పు
కుంకుమపువ్వు: ఒక చిన్న చెంచా

తయారీ విధానం
ముందుగా బాదాం, జీడిపప్పు, పిస్తాలను కలిపి పొడిలా చేసుకోవాలి. తరువాత పాలను మరిగించాలి. అందులో నిమ్మరసం కలిపి పాలను విరిగేలా చేసుకోవాలి. దీన్ని చెనా అంటారు. ఈ విరిగిన పాలను శుభ్రమైన బట్టలో వేసి వడకడితే నీరంతా బయటకుపోయి చెనా వేరవుతుంది. పులుపు పోవడానికి దీన్ని మరోసారి నీళ్లతో కడిగి వడకట్టి పెట్టుకోవాలి. ఇప్పుడీ చెనాని చేత్తో మృదువుగా పలుకులు లేకుండా పిండిలా కలుపుకోవాలి. దీనిలో బొంబాయిరవ్వ, నారింజ రంగు, యాలకులపొడి వేసుకుని బాగా కలిపి ఐదు నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెనాని చేత్తో చిన్న డొప్పల్లా చేసుకుని అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్ పొడి వేసుకుని ఎక్కడా పగుళ్లు లేకుండా మూసేయాలి. స్టవ్‌పై ఒక గినె్నలో పంచదారను తీసుకుని, ఇందులో నీళ్లుపోసి పాకం పట్టుకోవాలి. ఇందులోనే కుంకుమపువ్వును కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నిముషాల పాటు మరిగిస్తే పాకం తయారవుతుంది. వీటిల్లో చెనా ఉండలు వేసి మూతపెట్టేయాలి. అంతే.. పదిహేను నిముషాలకు చెనా ఉండలు రెట్టింపు సైజులోకి వచ్చేస్తాయి. ఎంతో రుచికరమైన ఈ రసగుల్లాలను పిల్లలు అటూ ఇటూ తిరుగుతూనే లాగించేస్తారు.
*
కలాఖండ్ పొంగల్
కావలసిన పదార్థాలు
బియ్యం: అరకప్పు
పెసరపప్పు: అరకప్పు
పంచదార: ముప్పావుకప్పు
పచ్చకర్పూరం: చిటికెడు
కలాఖండ్: 50 గ్రాములు
మిల్క్‌మెయిడ్: నాలుగు చెంచాలు
నెయ్యి: రెండు చెంచాలు
బాదం: ఆరు
జీడిపప్పు: ఆరు
గసగసాలు: రెండు చిన్న చెంచాలు

తయారీ విధానం
అరకప్పు పాలలో బాదం, జీడిపప్పు, గసగసాలను నానబెట్టాలి. ఒక గినె్నలో బియ్యం, పెసరపప్పును వేసుకుని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకుని పచ్చకర్పూరం కూడా వేసి ఉడికించుకోవాలి. తరువాత ఇందులో కలాఖండ్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన ఈ మిశ్రమాని కి మిల్క్‌మెయిడ్ కూడా చేర్చుకోవాలి. ముందుగా పాలల్లో నానబెట్టి ఉంచిన బాదం, జీడిపప్పు, గసగసాలను పేస్ట్ చేసి కలాఖండ్ మిశ్రమానికి కలుపుకోవాలి. దీనిపై రెండు చెంచాల నెయ్యి వేసి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దీన్ని అమ్మవారికి ప్రసాదంగా కూడా పెడతారు.
*
మోతీచూర్ లడ్డూ విత్ రబ్రీ
కావలసిన పదార్థాలు
మోతీచూర్ లడ్డూలు: నాలుగు
పాలు: ఒక లీటరు
కోవా: 70 గ్రాములు
పంచదార:
100 గ్రాములు
కుంకుమపువ్వు: చిటికెడు

తయారీ విధానం
మందపాటి పాన్‌లో లీటర్ పాలు పోసి సిమ్‌లో పెట్టి బాగా మరిగించాలి. ఈ పాలు దాదాపు అరలీటర్ అయ్యేంతవరకు మరిగించాలి. తరువాత కోవా, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. తరువాత దీనిపై కుంకుమపువ్వు వేసి చల్లారనివ్వాలి. లేదా ఫ్రిజ్‌లో అయినా పెట్టుకోవచ్చు. రెండు గంటల తర్వాత ఈ రబ్రీని ఒక బౌల్‌లోకి తీసుకుని అందులోమోతీచూర్ లడ్డూ వేసి సర్వ్ చేయాలి.