రుచి

పునుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత తక్కువగా, కావాల్సినంత మేరనే వండినా ఒక్కోసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అట్లా మిగిలిన అన్నాన్ని తినబుద్ధి కాదు పారేయబుద్ధి కాదు. అట్లాంటపుడు అన్నాన్ని పసందుగా ఇలా మార్చుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

మిగిలిన అన్నం - రెండు కప్పులు
ఎండుకారం - ఒక స్పూన్
ఉప్పు - తగినంత
జీలకర్ర- ఒక స్పూన్
అల్లం వెల్లులి ముద్ద - ఒక స్పూన్
ఉల్లితరుగు - ఒక కప్పు
పచ్చి మిరప- ఒకటి
వేయించుకోవడానికి సరిపడినంత నూనె

తయారు చేసేవిధానం:

అన్నంలోకి ఉప్పు , కారం, అల్లవెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఉల్లితరుగు పచ్చి మిరప తరుగు ఇలా అన్ని వేసి కలిపి బాగా మెత్తగా చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసి నూనెలో వేసి ఎర్రగా కాల్చుకోవాలి. వీటిని సాస్‌తో తింటే ఆహా ఏమి రుచి అంటారు.